ETV Bharat / state

UGC New Chairman: 'డిజిటల్‌ యూనివర్సిటీని పట్టాలకెక్కిస్తాం' - UGC New Chairman name

UGC New Chairman: దేశంలోని గ్రామీణ ప్రాంతాలు, పేద విద్యార్థులకు విశ్వవిద్యాలయ విద్యను చేరువ చేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడేలా నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేస్తానని యూజీసీ నూతన ఛైర్మన్‌ ఆచార్య మామిడాల జగదీశ్‌కుమార్‌ చెప్పారు. అందుకు ఇటీవల ప్రకటించిన డిజిటల్‌ విశ్వవిద్యాలయాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. శుక్రవారం ‘ఈనాడు-ఈటీవీ భారత్​’కు ఫోన్‌లో ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఆయన పలు అంశాలను వెల్లడించారు.

UGC New Chairman
UGC New Chairman
author img

By

Published : Feb 5, 2022, 6:28 AM IST

  • జాతీయ నూతన విద్యా విధానాన్ని ఎలా అమలు చేయబోతున్నారు?
    నూతన విద్యా విధానం అమలు బాధ్యత యూజీసీదే. ప్రస్తుతం ఉన్నత విద్యలో జాతీయ స్థూల నమోదు 30శాతం మాత్రమే ఉంది. దాన్ని 50శాతానికి పెంచాలన్నది కొత్త విధాన లక్ష్యం. వర్సిటీ విద్యను గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాలకు చేరువ చేస్తేనే అది సాధ్యం. ఇటీవల డిజిటల్‌ యూనివర్సిటీని నెలకొల్పుతామని కూడా కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించింది. త్వరగా పట్టాలెక్కిస్తాం. దాని ద్వారా స్థానిక భాషల్లో కోర్సులు అందిస్తాం. ఆంగ్లంలో బోధన వల్ల గ్రామీణ ప్రాంతాల వారు కొంత ఇబ్బంది పడుతున్నారు. అందుకే తెలుగుతో సహా మాతృభాషల్లో కూడా కోర్సులు తెస్తాం.
  • డిగ్రీ పట్టాలిచ్చే స్వయంప్రతిపత్తి విద్యాసంస్థగా ప్రతి కళాశాలను 2032 నాటికి మార్చడం సాధ్యమేనా?
    స్వయంప్రతిపత్తి దిశగా యూనివర్సిటీలు ఎదిగేందుకు కొన్నేళ్ల నుంచి యూజీసీ ప్రోత్సహిస్తోంది. కొత్త విద్యా విధానం కూడా దాన్ని సిఫార్సు చేసింది. ప్రతి కళాశాల కూడా డిగ్రీ పట్టా ఇచ్చే స్వయంప్రతిపత్తి సంస్థగా మారాలి. అందుకు తగిన ప్రమాణాలను పెంచుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం నేను న్యాక్‌ ఛైర్మన్‌గా కూడా ఉన్నా. స్వయంప్రతిపత్తి హోదా దక్కాలంటే ముందుగా న్యాక్‌ గ్రేడ్‌ ఉండాలి. న్యాక్‌ రావాలంటే సొంత స్థలం, భవనాలు ఉండాలి. ఆ దిశగా అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా కార్యశాలలు కూడా నిర్వహిస్తున్నాం. గడువులోగా లక్ష్యం సాధించేందుకు కృషిచేస్తాం.
  • ప్రతి ఏటా నకిలీ వర్సిటీల జాబితాను వెబ్‌సైట్లో ఉంచి యూజీసీ చేతులు దులుపుకుంటుందన్న విమర్శలు ఉన్నాయి? ఆ విధానాన్ని మీరు మారుస్తారా?
    నకిలీ వర్సిటీల విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. ఆయా రాష్ట్రాలతో కలిసి తగిన చర్యలు తీసుకుంటాం. మీడియా కూడా అలాంటి వాటిపై నిఘా ఉంచి విద్యార్థులు నష్టపోకుండా చూడాలి.
  • తెలుగు రాష్ట్రాల్లో వర్సిటీలకు యూజీసీ నుంచి ప్రత్యేక సహకారం ఉంటుందా?
    తొలుత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వర్సిటీల ఉపకులపతులతో సమావేశం ఏర్పాటు చేసి విశ్వవిద్యాలయాల్లో సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తా. నాకు తెలిసినంత వరకు ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాత్కాలిక అధ్యాపకులతో నడిపిస్తున్నారు. వాటిని భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాం. యూజీసీపరంగా ఏమైనా పెండింగ్‌లో ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరిస్తా.
  • యూజీసీలో ఇతర నియంత్రణ సంస్థలను మిళితం చేసి హెకీగా ఎప్పుడు మారుస్తారు?

యూజీసీ స్థానంలో భారత ఉన్నత విద్యాకమిషన్‌ (హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా-హెకీ)ని తీసుకురావాలని జాతీయ విద్యావిధానం సిఫార్సు చేసింది. అంటే యూజీసీ, ఏఐసీటీఈ, ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) తదితర పలు నియంత్రణ సంస్థలను కలిపి హెకీగా మారుస్తాం. అందుకు ముందుగా పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టాలి. ఆ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి 6 నెలల నుంచి ఏడాది వరకు పడుతుంది. నాణ్యమైన విద్యను అందిస్తున్న ఐఐటీల స్థాయికి మన వర్సిటీలను తీసుకువస్తాం.

ఇదీచూడండి: యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​ ఛైర్మన్​గా మామిడాల జగదీష్​ కుమార్​ నియామకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.