హైదరాబాద్ భాజపా కార్యాలయంలో ఉగాది సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పొంగులేటి సుధాకర్ హాజరయ్యారు. కార్యకర్తలు, నేతలంతా సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. నేతలు స్వయంగా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తయారు చేశారు. అనంతరం ఒకరినొకరు వికారినామ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అందరూ కలిసి పంచాగ శ్రవణం విన్నారు.
ఉగాది సందర్భంగా ప్రజలు విముక్తి కోసం సంకల్పం తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ ఆశించిన విధంగా లేదన్నారు. ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ తెరాసతో లాలూచీ పడిందని లక్ష్మణ్ విమర్శించారు.
ఉగాది పర్వదినాన్ని కార్యకర్తలతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్ తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి: తెలుగు సంవత్సర వసంతాగమనం