ETV Bharat / state

లవర్స్​ కోసం ఇంట్లో నుంచి వెళ్తే.. లాడ్జిలో నిర్బంధం.. చివరకు ఫోన్​ లొకేషన్​తో.. - కర్నూలులో మైనర్ అమ్మాయిలు అదృశ్యం

Two Girls went Missing in Kurnool for Lovers: తెలిసీ తెలియని వయస్సు ఆ అమ్మాయిలది.. ప్రేమనా లేక ఆకర్షణ అనే తేడా తెలుసుకోని పసిప్రాయం. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ఇద్దరు మోసగాళ్లు వారి మాయమాటలతో ఆ అమ్మాయిలను ప్రేమ పేరుతో తమ ఒళ్లో వేసుకున్నారు. అది నమ్మిన మైనర్ బాలికలకు అసలు విషయం తెలియడంతో తాము మోసపోయామని బోరున విలపించారు. ఈ క్రమంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Two Girls Missing in the Name of Love
Two Girls Missing in the Name of Love
author img

By

Published : Feb 18, 2023, 2:07 PM IST

Two Girls went Missing in Kurnool for Lovers : ఇంటర్ చదువుతున్న రోజుల్లో చిగురించిన స్నేహం ప్రేమకు బాటలు వేసింది. తెలిసీ తెలియని వయస్సులో ఆ అమ్మాయిలు మాయగాళ్ల మాటలు నమ్మి ప్రేమలో పడ్డారు. వారు చెప్పిందే వేదమనుకుని కన్నవారిని వదిలి ఊరు కానీ ఊరు వెళ్లారు. తమను ప్రేమించిన వారే సర్వస్వం అని నమ్మిన ఆ మైనర్ బాలికలు అసలు విషయం తెలియడంతో తాము మోసపోయామని తెలుసుకున్నారు. పోలీసుల రంగప్రవేశంతో ఆ అమ్మాయిలు ఊపిరిపీల్చుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు తాలుకా పీఎస్ పరిధిలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు బాలికలకు కళాశాలకు వెళ్తున్న క్రమంలో లారీ క్లీనర్ బి.సురేష్, అతడి స్నేహితుడితో పరిచయం ఏర్పడింది. అలా రోజు మాటలు కలుపుతూ వారితో చనువుగా మాట్లాడుతున్నారు. కొద్ది రోజులకు ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారి మాయమాటలతో ఇద్దరు బాలికలను ఎలాగో అలా తమ బుట్టలో పడేసుకున్నారు. లోకజ్ఞానం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న ఆ బాలికలు ఆ మోసగాళ్లను అమాయకంగా నమ్మారు.

రెండు రోజుల కిందట కళాశాలకు వెళ్లిన వారు అటునుంచి అటే వారితో వెళ్లిపోయారు. ఆ యువకులను నమ్మి వెళ్లిన ఇద్దరు బాలికలను ఓ లాడ్జిలో నిర్భంధించారు. అనంతరం వారిలో ఒకడైన లారీ క్లీనర్ బి.సురేష్ ఓ బాలిక సెల్​ఫోన్ తీసుకుని కృష్ణపట్నం పోర్టుకు బయలుదేరాడు. ఈ క్రమంలో రాత్రి అయినా తమ బిడ్డలు ఇంటికి రాకపోవడంతో బాలికల తల్లిదండ్రులు కళాశాల చుట్టూ పక్క ప్రాంతాలలో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

అక్కడ అనుమానాస్పదం.. ఇక్కడ గుర్తింపు.. : తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన కర్నూలు పోలీసులు ఓ బాలిక సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా నెల్లూరులో ఉన్నారని గుర్తించారు. బాలికల తల్లిదండ్రులతో కలిసి గురువారం నెల్లూరు చేరుకుని పలు ప్రాంతాల్లో గాలించారు. ప్రయోజనం లేకపోవడంతో నెల్లూరు పోలీసుల సహాయం తీసుకున్నారు. మరో వైపు డీసీపల్లి టోల్ గేటు వద్ద మర్రిపాడు ఎస్సై విశ్వనాథ్​రెడ్డి.. తన సిబ్బందితో తనిఖీలు చేపడుతున్నారు.

ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళుతున్న ఓ లారీని తనిఖీ చేశారు. అప్పుడు వారికి బి.సురేష్ అనే వ్యక్తి చిక్కాడు. అతని వద్ద బాలిక సెల్ ఫోన్ లభించింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. బాలికలు కర్నూలులోని ఓ లాడ్జిలో ఉన్నారని చెప్పడంతో వెంటనే నెల్లూరు పోలీసులు కర్నూలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని గదిలో బందీగా ఉన్న బాలికలను సురక్షితంగా కాపాడారు. అక్కడ కాపలాగా ఉన్న మరో నిందితుడిని అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని కర్నూలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.