శంషాబాద్‌లోని ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో కుమార్ అనే రెండేళ్ల బాలుడు కిడ్నాపయ్యాడు. తన కొడుకును గుర్తు తెలియని దుండగులు అపహరించారని తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలానికి చెందిన వెంకటమ్మ కుటుంబం కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తోంది. కుమార్ కిడ్నాప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సీఐ రామకృష్ణ వెల్లడించారు.
ఇవీచూడండి: అనుమానాస్పద స్థితిలో ఆర్మీ జవాను మృతి