హైదరాబాద్ పాతబస్తీ ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలోని నవాబ్సహబ్ కుంట ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఎం.డి.జెన్ అనే బాలుడు (2 సంవత్సరాలు) భవనం పైన ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు 4వ అంతస్థు నుంచి కింద పడి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న ఫలక్నుమా పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకున్న కొడుకు చనిపోవడం వల్ల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చదవండి: కరోనాపై గెలిచిన హైదరాబాదీకి మోదీ ఫోన్