హైదరాబాద్ సరూర్ నగర్ పీఎస్ ప్రగతి నగర్లో సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ నెల 1న తెల్లవారుజామున ఇంట్లో సిలిండర్ పేలి రమేశ్, లక్ష్మణ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ ఉస్మానియా ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే.?
తెల్లవారుజామున ఇంట్లో నుంచి గ్యాస్ వాసన వస్తున్న విషయాన్ని గమనించిన రమేశ్... సోదరుడిని నిద్రలేపాడు. అప్రమత్తమై భార్యపిల్లలతో కలిసి బయటకు వచ్చారు. ఆ తర్వాత రమేశ్, లక్ష్మణ్ ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లి గ్యాస్ ఎక్కడ లీక్ అవుతుందో చూసేందుకు గది లోకివెళ్లారు. చీకటిగా ఉండటం వల్ల లైట్ వేశారు. వెంటనే భారీ పేలుడు శబ్దంతో మంటలు వ్యాపించాయి. పేలుడు ధాాటికి చుట్టపక్కల ఇళ్లల్లో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.