Two People Died in Plant Mixer in Hyderabad : యాజమాన్యం నిర్లక్ష్యం ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొంది. బతుకుదెరువు కోసం పని కోసం వచ్చిన వారు.. విగత జీవులుగా మారారు. కూలీల మృతులకు కారణమైన యాజమాన్యం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మృతదేహాలను ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంస్థపై దాడికి దిగారు. ఈ ఘటన హైదరాబాద్ నార్సింగిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. నిర్మాణ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యానికి ఇద్దరు యువకులు బలయ్యారు. నార్సింగి పరిధిలోని పుప్పాలగూడలో ఉన్న ఓ నిర్మాణ సంస్థలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. బిల్డింగ్ నిర్మాణం చేపట్టిన ఆ సంస్థలో చాలా మంది కూలీలు పని చేస్తున్నారు. రెడిమిక్స్ ప్లాంట్ మిక్సర్‌లో ఇద్దరు కార్మికులు శుభ్రం చేస్తున్నారు.
Two Young Man Crushed In Plant Mixer Plant : ఇది గమనించని ఆపరేపర్ మిషన్ ఆన్ చేశారు. మిషన్ ఆన్ చేయడంతో శుభ్రం చేస్తున్న బేటా సోరేన్, సుశీల్ ముర్ము అనే కార్మికులు మిషన్‌లో నుజ్జునుజ్జు అయి మరణించారు. రెడిమిక్స్ ప్లాంట్ యాజమాన్యం మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువులు అగ్రహావేశాలతో నిర్మాణ సంస్థపై దాడి చేశారు. సంస్థలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి అద్దాలను పగులగొట్టారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Acid Tank Blast Took Place in Nalgonda : మరోవైపు.. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రం శివారులో ఉన్న ఐడీఎల్ ఎక్స్‌ప్లోసివ్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు యాసిడ్సి ట్యాంకర్ పేలింది. భోజన విరామ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో కార్మికులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రెగ్యులర్‌గా ఎయిర్ లీకేజీని మెయింటైన్ చేయాల్సి ఉండగా.. ట్యాంకులో ఎయిర్ ఫుల్ అయినా ఎయిర్ వాల్ ఓపెన్ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు. దాంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది.
Young Woman Murder in Champapet : చంపాపేట్ యువతి హత్య కేసులో వీడిన మిస్టరీ.. అసలు ఏం జరిగిందంటే..?