జనవరి 1 నుంచి జూన్ 30 వరకు సికింద్రాబాద్-ఫలక్నుమా-ఉమ్దానగర్, సికింద్రాబాద్-బొల్లారం-మేడ్చల్-మనోహరాబాద్ రూట్లలో 1 మెమో, 12 డెమూ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు.
డబ్లింగ్ పనులు కొనసాగుతున్నందున సర్వీసులు నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ రూట్లలో డెమూ రైళ్ల రద్దు
- సికింద్రాబాద్-మేడ్చల్ - సికింద్రాబాద్ డెమూ ప్యాసింజర్
- ఫలక్నుమా- మేడ్చల్ - ఫలక్నుమా డెమూ ప్యాసింజర్
- ఫలక్నుమా - ఉమ్దానగర్- ఫలక్నుమా డెమూ ప్యాసింజర్
- ఫలక్ నుమా - ఉమ్దానగర్ - సికింద్రాబాద్ డెమూ ప్యాసింజర్
- బొల్లారాం-ఫలక్ నుమా - బొల్లారం డెమూ ప్యాసింజర్.
- ఫలక్ నుమా - మనోహరాబాద్- సికింద్రాబాద్ డెమూ ప్యాసింజర్
- సికింద్రాబాద్ - మనోహరాబాద్- సికింద్రాబాద్ డెమూ ప్యాసింజర్
- సికింద్రాబాద్ - ఉమ్దానగర్ డెమూ ప్యాసింజర్
- ఫలక్ నుమా - ఉమ్దామగర్ డెమూ ప్యాసింజర్
ఫలక్నుమా - భువనగిరి- ఫలక్నుమా డెమూ ప్యాసింజర్లను రద్దు చేశారు.
- ఇవీచూడండి: గాంధీ ఆస్పత్రిలో దిశ నిందితుల మృతదేహాలు