సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త గజేంద్ర పరీక్ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ఒమర్ అలీతో పాటు సయ్యద్ సల్మాన్, మిరాజ్ అజహర్ అలీని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 50 లక్షల 48వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ తరలించారు. గత నెల 28న రాత్రి దోమలగూడ ప్రాంతంలో వ్యాపారి గజేంద్రను కిడ్నాప్ చేసి కోటి రూపాయలతో ఉడాయించారు. ఆ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు... తాజాగా మరో ఇద్దరిని పట్టుకున్నారు. నిందితులను చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండిః లైవ్ వీడియో: వరదల్లో కొట్టుకుపోయిన బైక్