దేశంలోనే తొలిసారిగా కొవిడ్ రోగికి రెండు ఊపిరితిత్తులు దిగ్విజయంగా మార్చిన ఘనత కిమ్స్‌కె సాధ్యమని కిమ్స్ ఎండీ భాస్కర్ రావు పేర్కొన్నారు. ఇటీవల కిమ్స్‌లో ఓ కరోనా బాధితుడికి... రెండు ఊపిరితిత్తులను మార్చినట్లు ఆయన తెలిపారు.
పంజాబ్‌కి చెందిన 32 ఏళ్ల వ్యక్తికి ఊపిరితిత్తులను అమర్చినట్టు కిమ్స్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యుడు సందీప్ అట్టావర్ పేర్కొన్నారు. ఊపిరితిత్తుల మార్పిడి జరిగన బాధితుడు కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. దేశంలోని కొవిడ్ పాజిటివ్ వచ్చిన బాధితుడికి రెండు ఊపిరితిత్తులను మార్చడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జంతువులపై కొవాగ్జిన్ సత్ఫలితాలిచ్చింది: భారత్ బయోటెక్