రాష్ట్రంలో ఇవాళ, రేపు అక్కడక్కడా భారీ వర్షాలు (rains in telangana )కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.
కిందిస్థాయి గాలులు ముఖ్యంగా ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని పేర్కొన్నారు. ఈరోజు అల్పపీడనం కొమరిన్ ప్రదేశం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని వివరించారు. ఉపరితల ద్రోణి కొమరిన్ ప్రదేశం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్, తమిళనాడు తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి ఉందని తెలిపారు.
ఇదీ చూడండి: