అనాథ ఆశ్రమం నుంచి ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన హైదరాబాద్ ఉప్పల్ ఠాణా పరిధిలో జరిగింది. రామంతాపూర్ ప్రగతినగర్‌లోని డాన్‌బాస్కో అనాథ ఆశ్రమం నుంచి... కర్నూల్ జిల్లా డోన్‌కు చెందిన నందీప్, నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన అఖిల్ అదృశ్యమయ్యారు. ఈనెల 8న ఉదయం7 గంటల సమయంలో ఆశ్రమం నుంచి బయటకువెళ్లి తిరిగి రాలేదు. ఘటనపై ఆశ్రమ నిర్వహకుడు రాజు ఫిర్యాదుపై అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: మేడారం జాతరకు ఎలా వెళ్లాలి.. ఛార్జీ ఎంత?