ETV Bharat / state

రెండు బైక్​లు ఢీకొని... ఇద్దరు మృతి

ఎదురెదురుగా వెళ్తున్న రెండు బైక్​లు ఢీకొని.. ఇద్దరు ద్విచక్రవాహనదారులు మృతి చెందిన ఘటన పటాన్​చెరులో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

two-bikes-collied-at-patancheru-two-members-died
రెండు బైక్​లు ఢీకొని... ఇద్దరు మృతి
author img

By

Published : May 18, 2020, 4:27 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. పటాన్​చెరు మండలం భానూర్​లో బీడీఎల్ పరిశ్రమలో పనిచేసే కార్మికుడు గోపాల్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... కొండకల్ గ్రామానికి చెందిన అశోక్​ తన భార్య, కూతురితో మరో బైక్​పై వెళ్తూ.. ఎదురెదురుగా ఢీకొన్నారు.

ఈ ప్రమాదంలో గోపాల్, అశోక్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ఇరువురు మృతి చెందారు. మృతదేహాలను పటాన్​చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశోక్​ భార్య సుచిత, అతని కూతురు సురక్షితంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: 57 రోజుల తర్వాత తెరుచుకున్న ఆటోమొబైల్ షాపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.