ఇంటిలో పదవుండమే లక్ష్యంగా...
మెదక్ జిల్లాలో భార్యాభర్తలు, తల్లీకొడుకులు, బావమరదలు పురపోరులో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మూడు సార్లు ఛైర్మన్, రెండుసార్లు కౌన్సిలర్‌గా వ్యవహరించిన బట్టి జగపతి ఈసారి పోటీగా దూరంగా ఉండి తెరాస తరఫున 18వ వార్డు నుంచి తన భార్యను, 5వ వార్డు నుంచి కుమారున్ని బరిలో దించారు. పురపాలక మాజీ అధ్యక్షులు మల్లికార్జున గౌడ్ 30వ వార్డు నుంచి పోటీ చేస్తుండగా... ఆయన సతీమణి గాయత్రి 15 వ వార్డు నుంచి తెరాస తరఫున బరిలో ఉన్నారు. వరుసకు బావమరదలైన గూడూరు ఆంజనేయులు గౌడ్, అనూష 25, 24 వార్డుల నుంచి తెరాస అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
ఒకే గడప నుంచి వేర్వేరు వార్డుల్లోకి...
మేడ్చల్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ నుంచి తోడికోడళ్లైన వేముల రజిత 12 వ వార్డు, శ్రావణి 21 వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. గుండ్లపోచంపల్లి పురపాలికలో భాజపా తరఫున 15వ వార్డు నుంచి అమరం మోహన్ రెడ్డి, 4వ వార్డు నుంచి ఆయన భార్య సరస్వతి బరిలో దిగారు. తూముకుంట పురపాలక సంఘం ఎన్నికల్లో భాజపా అభ్యర్థులుగా 5 వ వార్డు నుంచి రవీందర్ గౌడ్, 7 వ వార్డు నుంచి ఆయన సతీమణి అపర్ణ పోటీలో నిలిచారు.
ఒకే పేరు... ఒకే వార్డు... వేర్వేరు జెండాలు...
మహబూబాబాద్ పురపాలికలోని మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే పేరు గల తోడికోడళ్లు ఒకే వార్డులో వేర్వేరు పార్టీల నుంచి పోరుకు సిద్ధమయ్యారు. 16 వ వార్డు నుంచి తెరాస అభ్యర్థిగా భానోత్ పద్మ... సీపీఎం అభ్యర్థిగా మరో భానోత్ పద్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
హోరాహోరీగా ప్రచారం సాగించి విజయం కోసం శ్రమించిన కుటుంబసభ్యులు... బంధాలు వేరు రాజకీయాలు వేరని హితవు పలుకుతున్నారు. ఎవరు గెలిచినా... ఓడినా... ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉంటామంటున్నారు.
బస్తీమే సవాల్: కాలం మారింది..సెల్‌ఫోన్‌తో ఇస్మార్ట్ ప్రచారం..