సృష్టి ఎన్నో వింతలు.. అద్భుతాలకు మూలం. వాటిలో కవల పిల్లల జన్మ ప్రత్యేకం. ఒకే రూపంలో జన్మించిన కవలలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తారు. అంతర్జాతీయ కవలల దినోత్సవాన్ని పురస్కరించుకుని... తెలుగు రాష్ట్రాలలో ఉన్న కవల పిల్లలంతా ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఒకేచోట కలిశారు. అంతేకాదు వారిలో ఉన్న కళలను ప్రదర్శించారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెలు... ఇలా అంతా కలిసి సంబురాలు జరుపుకున్నారు. ఒకే పోలికలతో ఉన్న జోడిలను చూసి మైమరచిపోయారు.
అసలే కరోనా పుణ్యమా అని ఏడాది వరకు మానవ బంధాలకు అవరోధాలు ఏర్పడి... మళ్లీ అంతా ఒకేచోట కలుసుకోవడం ఆనందంగా ఉందని వారు చెప్తున్నారు. ఏటా ఇదే రోజు అందరూ కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం... యోగక్షేమాలు తెలుసుకోవడం... ఇలా తెలుగు రాష్ట్రాలలో ఉన్నవారంతా వాట్సాప్ బృందంగా ఏర్పడి ఒకరికొకరు సహకారం చేసుకుంటున్నారు.
ఇదీ చదవండి: నల్లమలలో 25 సెంటీమీటర్ల పొడవైన అరుదైన సర్పం