ETV Bharat / state

పంచాయతీలకు పెద్దపీట... రూ.23,005 కోట్లు కేటాయింపు - telangana finance minister harish rao

2020-21 ఆర్థిక ఏడాదిలో తెలంగాణ పంచాయతీలు, గ్రామాభివృద్ధికి రూ. 23,005 కోట్లు కేటాయించారు. పురపాలికల కోసం ఈ బడ్జెట్​లో రూ.14,809 కోట్లు వెచ్చించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్​ రావు తెలిపారు.

budget 2020 telangana
తెలంగాణ పంచాయతీలకు రూ.23,0005 కోట్లు
author img

By

Published : Mar 8, 2020, 1:13 PM IST

Updated : Mar 8, 2020, 3:37 PM IST

తెలంగాణ పంచాయతీలకు రూ.23,0005 కోట్లు

తెలంగాణ గ్రామీణ జీవన ముఖ చిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. పంచాయతీరాజ్​, గ్రామాభివృద్ధికి బడ్జెట్​లో రూ.23,005 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రజా ప్రతినిధులపై, ఉద్యోగుల పై కఠిన చర్యలు తీసుకోవడానికి నూతన పంచాయతీరాజ్​ చట్టం వీలు కల్పించిందని మంత్రి పేర్కొన్నారు. అధికారులు, ప్రతినిధుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుందని వెల్లడించారు.

పట్టణ ప్రగతి
పట్టణ ప్రగతి

రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతోందని మంత్రి హరీశ్​ రావు అన్నారు. పురపాలికల కోసం బడ్జెట్​లో రూ.14,809 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మున్సిపాలిటీల పనితీరులో పారదర్శకతను పెంపొందించేందుకు ప్రభుత్వం నూతన పురపాలక చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు.

టీఎస్​-ఐపాస్​ తరహా సులభ పద్ధతుల్లో భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు టీఎస్​-బీపాస్​ విధానాన్ని ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్నట్లు హరీశ్​​ రావు పేర్కొన్నారు.

Last Updated : Mar 8, 2020, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.