ఉద్యోగం నిమిత్తం అమెరికాలో నివాసముంటున్న మేడ్చల్ జిల్లా మేడిపల్లి వాసి.. పానుగంటి శ్రీధర్ అనారోగ్యంతో అక్కడే మృతి చెందారు. ఈ మేరకు బుధవారం ఇక్కడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
గత నెల 27న అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన శ్రీధర్.. చికిత్స పొందుతూ ఈనెల 1న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేందుకు తెలంగాణ, భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శ్రీధర్ చెల్లెలు కవిత కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా, కేంద్ర హొం సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డికి స్థానిక భాజపా నేతల ద్వారా విజ్ఞప్తి చేశామని కవిత తెలిపారు.
![Tweet to KTR to extradite the body of a Telangana resident who died in America](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-05-03-america-lo-deatg-ab-ts10026_03122020082619_0312f_1606964179_110.jpg)
ఇవీ చూడండి: ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్