హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టులో రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్పై ఇవాళ మరోమారు విచారణ జరిగింది. ఐ ల్యాబ్ కేసులో ఇప్పటికే హైకోర్టు స్టే విధించిందని కోర్టుకు రవిప్రకాష్ తరఫు న్యాయవాది వెల్లడించారు. నకిలీ ధ్రువపత్రాల కేసు విషయంలో స్టే ఉన్న కారణంగా తాము కస్టడీ పిటిషన్పై విచారణ చెయలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఆయన తరఫు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్పై వాదనలను కూకట్‌పల్లి కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
ఇవీ చూడండి : అద్దె బస్సుల కోసం పదివేల టెండర్లు