తునికాకు సేకరణ సీజన్‌ని ముందస్తుగా మొదలుపెట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. అడవిని కాపాడడం, అగ్నిప్రమాదాల నివారణలో భాగంగా ఈ సారి సీజన్‌ను నవంబర్ నెల నుంచే తునికాకు సేకరణ(Tendu leaf collection) ప్రారంభమవుతుందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ తెలిపారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై బీడీ లీఫ్ అసోసియేషన్ సభ్యులతో బుధవారం రోజు సమావేశం నిర్వహించారు. 242 తునికాకు యూనిట్లను ఆన్‌లైన్‌లో వేలం ద్వారా కేటాయించాలని నిర్ణయించారు.
తునికాకు సేకరించే గుత్తేదారులే అటవీ ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్ల కోసం ఫైర్ వాచర్లను ఏర్పాటు చేయనున్నట్లు అటవీ శాఖ తెలిపింది. సమావేశంలో అదనపు పీసీసీఎఫ్‌లు సిద్దానంద్ కుక్రేటి, ఏకే సిన్హా, కవ్వాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ వినోదన్‌కుమార్, ఆదిలాబాద్, వరంగల్ సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లు రామలింగం, ఆశ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Green Code: 'యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం'