తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. హుజూర్నగర్ పోటీపై నాయకులతో చర్చించారు. పోటీ పై అధిష్టానం సందిగ్ధంలో ఉన్నప్పటికీ జిల్లా నాయకత్వం మాత్రం తప్పకుండా పోటీలో ఉండాలని పట్టు బడుతున్నట్లు సమాచారం. తుది నిర్ణయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకే వదిలేసినట్లు తెలుస్తోంది. హుజూర్నగర్ ఉప ఎన్నికల పోటీలో ఉండాలా లేదా అన్న అంశంపై మరో రెండుమూడు రోజుల్లో చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి : ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు