ETV Bharat / state

'నిఘావర్గాల హెచ్చరికలతో తిరుపతిలో తనిఖీలు ముమ్మరం'

దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న నిఘావర్గాల హెచ్చరికలతో తిరుపతి అర్బన్‌ పోలీస్ జిల్లా పరిధిలో తనిఖీలను విస్తృతం చేశారు. డాగ్‌స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలతో పాటు అదనపు సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు. అలిపిరి సమీపంలో సాగుతున్న తనిఖీలపై మా ప్రతినిధి నారాయణప్ప మరిన్ని వివరాలు అందిస్తారు.

'నిఘావర్గాల హెచ్చరికలతో తిరుపతిలో తనిఖీలు విస్తృతం'
author img

By

Published : Aug 26, 2019, 3:40 PM IST

'నిఘావర్గాల హెచ్చరికలతో తిరుపతిలో తనిఖీలు విస్తృతం'

.

'నిఘావర్గాల హెచ్చరికలతో తిరుపతిలో తనిఖీలు విస్తృతం'

.

Intro:తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి


Body:రోడ్డుపై నడిచి వెళుతున్న వ్యక్తిని తెలంగాణ ఆర్టీసీ డిపో బస్సు ఢీకొట్టడంతో మృతి చెందిన ఘటన ఉదయగిరి ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద జరిగింది. ఉదయగిరి లోని మంగళగిరి కాలనీకి చెందిన రాజా అనే వ్యక్తి ఉదయగిరి బస్టాండ్ కూడలిలోని దర్గా కాంప్లెక్స్ లో క్షౌరశాల దుకాణాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దుకాణాన్ని తెరిచేందుకు కాలనీ నుంచి బస్టాండ్ కూడలికి నడుచుకుంటూ వస్తూ ఆర్అండ్ బి అతిథిగృహం వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ డిపో ఆర్టిసి బస్సు ఉదయగిరి కి వస్తుంది. ఈ క్రమంలో రోడ్డుపై నడిచి వెళుతున్న రాజాను బస్సు ఢీ కొట్టింది. వేగంగా బస్సు అతని ఢీకొట్టడంతో రోడ్డు పక్క దూరంగా ఉండే రాళ్ల పై పడి తలపై తీవ్రగాయాలయ్యాయి. విషయాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని అతడిని వైద్యం కోసం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతదేహాన్ని తిరిగి వెనక్కి ఉదయగిరి కి తీసుకొచ్చి శవపంచనామా కోసం ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని మృతుని బంధువుల నుంచి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.


Conclusion:బైట్ : యు. సత్యనారాయణ, సర్కిల్ ఇన్స్పెక్టర్


రిపోర్టర్ : జి.శ్రీనివాసులు
సెల్ : 8008573944

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.