TTD on Vaikuntha Ekadashi Tickets : టికెట్లు ఉంటేనే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ప్రకటించారు. జనవరి 2 నుంచి 11 వరకు.. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతామన్నారు. రోజుకు పాతిక వేల చొప్పున 300 రూపాయల టికెట్లు,. ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని చెప్పారు. రోజుకు 50 వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని,.... ఇందుకోసం తిరుపతిలో 9, తిరుమలలో ఒక కౌంటర్ తెరుస్తామని ధర్మారెడ్డి వివరించారు. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై తితిదే విభాగాధిపతులతో ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు.
"జనవరి 2న వైకుంఠ ద్వార దర్శనం. జనవరి 11 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. వైకుంఠ ఏకాదశికి టికెట్లు కలిగి ఉన్న భక్తులకే దర్శనం. రూ.300 ప్రత్యేక దర్శన టిక్కెట్లు రోజుకు 25 వేలు చొప్పున జారీ. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో సర్వదర్శన టికెట్లు జారీ. రోజుకు 50 వేలు చొప్పున సర్వదర్శన టోకెన్లు జారీ. 10 రోజుల పాటు ఏకాంతంగా శ్రీవారి ఆర్జిత సేవలు. మహాలఘు ద్వారానే అందరికీ స్వామివారి దర్శనం" - ధర్మారెడ్డి, టీటీడీ ఈవో
Tirumala Vaikuntha Ekadashi Tickets : వైకుంఠ ద్వార దర్శనాలు అమల్లో ఉండే రోజుల్లో ఆర్జిత సేవలను.. ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఆన్ లైన్ ద్వారా టికెట్లు జారీ చేస్తామని.. తెలిపారు. డిసెంబరు 29 నుంచి జనవరి 3 వరకు తిరుమలలో అడ్వాన్స్ గదుల బుకింగ్ నిలిపివేస్తామని,.. నేరుగా సీఆర్వో కార్యాలయం వద్దే భక్తులందరికీ గదుల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: