నూతన జాతీయ విద్యావిధానం అమలు ద్వారా విద్యావ్యాపారం మరింతగా పెరిగే ప్రమాదం ఉందని టీఎస్‌యూటీఎఫ్ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి ఆందోళన వ్యక్తం చేశారు. భారత పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య (టీఎస్‌యూటీఎఫ్) పిలుపు మేరకు ఇవాళ హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం వద్ద సేవ్ ఇండియా డే సత్యాగ్రహం నిర్వహించారు.
విద్యా కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కార్పొరేటీకరణకు అనుగుణంగా రూపొందిస్తున్న దీన్ని భారత రాజ్యాంగానికి లోబడి సవరించాలని డిమాండ్ చేశారు. ఆశ్రితుల ప్రయోజనాల కోసమే బీఎస్ఎన్ఎల్ను నాశనం చేశారు. రైల్వే రూట్లును ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులు అనుమతిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'కాపాడే క్రమంలో తెలిసింది..వీరంతా కరోనా బాధితులని'