TSRTC Zero Tickets for Women : టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కోసం జీరో టికెట్ల (TSRTC Zero Tickets) జారీని అధికారులు మొదలు పెట్టారు. గురువారం అర్ధరాత్రి 12 గంటలు దాటాక ఈ విధానం అమల్లోకి వచ్చిందని చెప్పారు. టికెట్లు జారీ చేసే యంత్రా(టిమ్స్)ల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేశామని వివరించారు. బుధవారం రాత్రి నుంచే కుషాయిగూడ, మిధాని సిటీ డిపోల్లో ప్రయోగాత్మకంగా ‘జీరో టికెటింగ్’ అమలు చేసినట్లు పేర్కొన్నారు. అది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో అమల్లోకి తెచ్చామని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం నుంచి జీరో టికెట్లు జారీ చేయాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులకు ఎండీ వీసీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) ఆదేశాలిచ్చారు. డిసెంబరు 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. జీరో టికెట్‌లో బస్సు ఆర్డినరా, ఎక్స్‌ప్రెస్సా, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం తదితర వివరాలు అందులో ఉంటాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రారంభం - సద్వినియోగం చేసుకోవాలన్న నేతలు
పండగలు, జాతరలకు నడిపే బస్సులకూ వర్తింపు : రెగ్యులర్ బస్సులతో పాటు సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలు, కొమురవెల్లి, నాగోబా వంటి జాతరల సమయాల్లో జీరో టికెట్ అమలు చేయాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. పల్లెవెలుగు, మినీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ బస్సులతో పాటు రద్దీని బట్టి అదనంగా నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు జీరో టికెట్ వర్తింపజేయనున్నట్లు పేర్కొంది. వారాంతాల్లో నడిపే అదనపు బస్సులకూ కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.
TSRTC Free Bus Service Women in Telangana : మరోవైపు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు, నేటి నుంచి గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. అప్పుడే జీరో టికెట్ జారీ చేస్తారు. ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్, ఆర్డీనరీ బస్సుల్లో మహిళలు, బాలికలు, యువతులు, ట్రాన్స్‌జెండర్లు ఉచిత ప్రయాణం చేసినప్పటికీ ఎలాంటి గుర్తింపు కార్డులను కండక్టర్లు అడగలేదు. టికెట్‌లు కూడా ఇవ్వలేదు. రోజూ ఎంతమంది ఉచిత ప్రయాణం చేశారనే వివరాలను కండక్లర్లు ఎస్‌ఆర్‌లో నమోదు చేసుకున్నారు.
కిక్కిరిసిన నిర్మల్ బస్టాండ్ - సీటు కోసం డ్రైవర్ క్యాబిన్ ద్వారా బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికులు
Mahalakshmi Scheme in Telangana : అంతే తప్ప టికెట్ల రూపంలో కచ్చితమైన గణాంకాలు లేకుండా పోయాయి. ఇక ఈరోజు నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా ధ్రువీకరణను తెలిపే ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు, రేషన్ కార్డును చూపించి జీరో టికెట్ తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర సర్కార్ సూచించిన మూడు గుర్తింపు కార్డులను ప్రతీ మహిళ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని, లేకుంటే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని టీఎస్‌ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.
ఉచిత ప్రయాణం ఆనందం అంటున్న మహిళలు - నష్టపోతున్నామంటూ ఆటోడ్రైవర్ల ఆవేదన
ఉచిత ప్రయాణంతో ఆర్థికంగా ప్రయోజనం - మహాలక్ష్మి పథకంపై మహిళల ఆనందం