ETV Bharat / state

TSRTC Workers Protest at Raj Bhavan : 'గవర్నర్ సానుకూలంగా ఉన్నారు.. బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావంతో ఉన్నాం' - ఆర్టీసీ నేతలతో గవర్నర్ తమిళిసై చర్చలు

TSRTC Workers Protest at Raj Bhavan : రాష్ట్ర సర్కార్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును గవర్నర్‌ అనుమతించాలంటూ ఆ సంస్థ కార్మికులు రోడ్డెక్కారు. ఉదయం 2 గంటల పాటు బంద్‌తో మొదలైన ఉద్యోగుల నిరసన.. రాజ్‌భవన్‌ ముట్టడి వరకూ పోయింది. మరోవైపు యూనియన్‌ నాయకులతో.. గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చలు జరిపారు.

RTC workers  protest at Raj Bhavan
RTC workers protest at Raj Bhavan
author img

By

Published : Aug 5, 2023, 1:49 PM IST

నెక్లెస్‌రోడ్డు నుంచి రాజ్‌భవన్‌ వరకు ఆర్టీసీ కార్మికుల ర్యాలీ

TSRTC Workers Protest at Raj Bhavan : ఆర్టీసీ ఉద్యోగుల బిల్లును గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​ పెండింగ్​లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై కొన్ని సందేహాలున్నాయని.. ఈ మేరకు సీఎస్ శాంతికుమారికి లేఖ రాశారు. మరోవైపు గవర్నర్‌ ఇంకా బిల్లుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆర్టీసీ కార్మికులు తప్పుబట్టారు. ప్రభుత్వం, కార్మికులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే తమిళిసై ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రాజ్​భవన్ వద్ద నిరసనకు టీఎంయూ పిలుపునిచ్చింది.

RTC Workers Demands Governor to Approve RTC Bill : ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులు నెక్లెస్‌రోడ్డు నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా వచ్చారు. ఆర్టీసీ బిల్లును గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్​ ఆమోదించాలని నిరసన చేపట్టారు. బిల్లుపై ఎలాంటి రాజకీయాలు చేయకుండా ఆమోదించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని డిపోల నుంచి వచ్చిన కార్మికులు పాల్గొన్నారు. ధర్నా నేపథ్యంలో రాజ్​భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికుల ఆందోళనలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. 10 మంది ప్రతినిధుల బృందాన్ని రాజ్‌భవన్‌లోకి ఆమె ఆహ్వానించారు. ప్రస్తుతం గవర్నర్ పుదుచ్చేరిలో ఉండగా.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా యూనియన్‌ నాయకులతో చర్చలు నిర్వహించారు. టీఎంయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.ఆర్‌.రెడ్డి, థామస్‌రెడ్డి బృందం.. తమిళిసై సౌందర రాజన్​తో గంటకు పైగా చర్చించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తనను ఎంతో బాధించిందని అన్నారు. ఈ సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ కార్మికుల పక్షమేనని అన్నారు. గతంలో సమ్మె చేసినప్పుడు కార్మికులకు అండగా ఉన్నానని గుర్తు చేశారు. కార్మికుల ప్రయోజనాల కోసమే బిల్లును క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. ఈ మేరకు గవర్నర్ ట్వీట్ చేశారు.

  • I am pained to know about the strike conducted by RTC employees creating inconvenience to common public...I want to convey that I am always with them even during the previous strike I was with them ..now also I am studying it carefully because their rights should be… pic.twitter.com/WXqTSWHj7Q

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ తమ సమస్యలు విని.. సానుకూలంగా స్పందించారని సమావేశం అనంతరం టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను కోరామని చెప్పారు. కార్మికుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని.. తమిళిసై చెప్పారని వివరించారు. త్వరలోనే బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు.

Governor Tamilisai on pending bills : 'బిల్లులను తిప్పి పంపడం నా ఉద్దేశం కాదు.. ఎందుకు తిరస్కరించానో కారణాలు చెప్పాను'

ఈ క్రమంలోనే ప్రభుత్వ వివరణ ఇంకా తనకు అందలేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ చెప్పారని థామస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ వివరణ తర్వాత బిల్లు ఆమోదిస్తానని ఆమె చెప్పారని వివరించారు. కార్మికులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని.. ఆర్టీసీ కార్మికులకు గతంలోనూ అండగా ఉన్నానని గవర్నర్‌ గుర్తు చేశారని వెల్లడించారు. ఈ క్రమంలోనే తమిళిసైకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని థామస్​రెడ్డి తెలిపారు.

Pending Bills Issue: పెండింగ్‌ బిల్లులపై నిర్ణయం.. ఒకటి తిరస్కరించిన గవర్నర్

Tamilisai Talks with TMU Leaders on RTC Bill : అంతకుముందు ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 నుంచి 8 గంటల వరకు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో బస్సులు డిపోల్లో నిలిచిపోయాయి. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, చెంగిచర్ల, హయత్‌నగర్‌, షాద్‌నగర్‌, ఫలక్‌నుమా, ఫరూక్​నగర్, హకీంపేట, లింగపల్లి హెచ్‌సీయూ, కూకట్‌పల్లి తదితర డిపోల్లో కార్మికులు నిరసన చేపట్టారు. గవర్నర్ తమ సమస్యల పట్ల వెంటనే స్పందించి.. ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్ప లేదు. ఉదయాన్నే విద్యాసంస్థలకు, కార్యాలయాలకు వెళ్లే వారు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది.

Tamilisai Did Not Approve TSRTC Bill : ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపని గవర్నర్‌ తమిళిసై

Raj Bhavan on TSRTC Bill : కాస్త టైం కావాలి.. TSRTC బిల్లుపై రాజ్​భవన్ కామెంట్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.