తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో శుభవార్త చెప్పారు. నగదు చెల్లింపులతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కోసం నేటి నుంచి కొన్ని బస్టాండ్లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ చెల్లింపు సేవలను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు.
ప్రయాణికులు యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్(ఎంజీబీఎస్)లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్-కార్గో కేంద్రం, సికింద్రాబాద్‌లోని రేతిఫైల్ బస్‌పాస్ కౌంటర్లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలను ప్రయాణికులు వినియోగించుకునే వెసులుబాటు కలిగించామన్నారు.
ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకుని.. తమ అభిప్రాయాలు, సూచనలు ట్విట్టర్(tsrtcmdoffice) ద్వారా తెలియజేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు విజ్ఞప్తిచేశారు.
ఇదీ చూడండి: