ETV Bharat / state

సిటీ బస్సులుగా ‘సూపర్‌ లగ్జరీ’లు.. - Super luxury buses as city buses

Super luxury buses to run as city buses in Hyderabad : హైదరాబాద్ ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి కిక్కిరిసిన బస్సుల్లో ఇబ్బంది పడుతూ ప్రయాణించాల్సిన అవసరం లేకుండా టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాదికి 300 ఎలక్ట్రిక్ బస్సులు సమకూరేలోపు అదనంగా 700 బస్సులు సమకూర్చే పనిలో పడ్డారు. ఇందు కోసం సూపర్​ లగ్జరీ బస్సులను సిటీ బస్సులుగా మారుస్తోంది.

ts rtc bus
టీఎస్ఆర్టీసీ బస్సు
author img

By

Published : Dec 7, 2022, 9:48 AM IST

Super luxury buses to run as city buses in Hyderabad : కిక్కిరిసిన బస్సుల్లో ఇబ్బంది పడుతూ ప్రయాణిస్తున్న వారికి కాస్త ఊరటనిచ్చేలా టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది 300 ఎలక్ట్రిక్‌ బస్సులు సమకూరేలోపు అదనంగా 700 బస్సుల వరకూ సమకూర్చాలని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొత్తగా వచ్చిన వాహన చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన బస్సు తుక్కుగా మారాల్సిందే. 2023 నుంచి 300 సిటీ బస్సులు తుక్కుగా మారనున్నాయి. అందుకే అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు పిలిచింది.

undefined
సిటీ బస్సుగా సూపర్ లగ్జరీ బస్సు

ఈ నెలాఖరుకే దాదాపు 50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అదీగాక సూపర్‌లగ్జరీ బస్సులను సిటీ బస్సులుగా మార్చేందుకూ కసరత్తు మొదలైంది. అలా 600 సూపర్‌లగ్జరీ బస్సులు సమకూరనున్నాయి. ఇంకో 4-5 ఏళ్ల వరకూ వాటిని తిప్పొచ్చు. బాడీ, సీటింగ్‌ను మార్చనున్నారు. ఇప్పటికే 200 బస్సులు గ్రేటర్‌జోన్‌కు చేరుకున్నాయి. వాటి ఇంజిన్లను పరిశీలించి శబరిమల యాత్రలకు వినియోగిస్తున్నారు. అయ్యప్ప భక్తుల తాకిడి తగ్గిన తర్వాత మియాపూర్‌ గ్యారేజీకి తరలించి మార్పులు చేపడతారు. అందుకు ఒక్కో బస్సుకు రూ.5 లక్షల వరకూ ఖర్చు చేస్తారు. ఇప్పటికే 60 బస్సులను తిప్పుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.