ఆర్టీసి కార్మికుల రాష్ట్ర బంద్‌తో నగరంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే మహాత్మా గాంధీ బస్టాండ్ బోసి పోయింది. వచ్చిన ప్రయాణికులు కూడా బస్సులు లేకపోవటం వల్ల వెనుతిరిగారు. సిటీ బస్సులు కూడా తిరగకపోవటం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అదునుగా ఆటోలు, క్యాబ్‌లు ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని నగరవాసులు వాపోయారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోఠి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: స్తంభించిన రాకపోకలు... విపక్షనేతల అరెస్ట్