సమ్మెపై హైకోర్టులో జరిగిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తమ వాదన వినిపించామని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాయంత్రం 4గంటలకు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రజారవాణా వ్యవస్థను కాపాడేందుకే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు నోటీసులు రాలేదని... వస్తే స్పందిస్తామని అన్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై విచారణ ఈనెల 15కు వాయిదా