ETV Bharat / state

శ్రీశైల మల్లన్న దర్శనానికి ​ఆర్టీసీ ప్రత్యేక బస్​ సర్వీసులు - telangana latest news

TSRTC special bus services to Srisailam: దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి. ఏటా శివరాత్రికి ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బసులు నడుపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

టీఎస్​ఆర్టీసీ
టీఎస్​ఆర్టీసీ
author img

By

Published : Feb 7, 2023, 3:02 PM IST

TSRTC special bus services: మహాశివరాత్రి సందర్బంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి జంటనగరాల నుంచి 390 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు. ఈనెల 16 నుంచి 19 వరకు మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌, జూబ్లీబస్‌ స్టేషన్‌, దిల్​సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌, ఐఎస్‌ సదన్‌, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈల్‌ ప్రాంతాలతో పాటు నగరంలోని పలు ప్రారతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈనెల 16న 36 ప్రత్యేక బస్సులు, 17న 99బస్సులు, 18న 99బస్సులు, 19న 88 బస్సులు నడపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మిగతా 68 బస్సులు ఇతర ప్రాంతాల నుంచి నడపనున్నట్లు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి శ్రీశైలంకు సూపర్‌ లగ్జరీలో ప్రయాణించేందుకు ఒకరికి రూ.600, డీలక్స్‌ కు రూ.540, ఎక్స్‌ప్రెస్ కు రూ.460లు టికెట్ చార్జీలు వసూలు చేయనున్నారు.

నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి సూపర్‌ లగ్జరీలో ప్రయాణించే వారికి ఒక్కొక్కరికి రూ.650లు, డీలక్స్‌లో రూ.580, ఎక్స్‌ ప్రెస్‌లో రూ.500 వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ బస్సులకు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కూడా కల్పించామన్నారు. మరింత సమాచారం కోసం ఎంజీబీఎస్‌ లో 9959226250, 9959226248, 9959226257 ఫోన్‌ నెంబర్లలో, జేబీఎస్‌ లో 9959226246, 040-27802203, ఐ.ఎస్‌.సదన్‌ లో 9959226250, బీ.హెచ్‌.ఈల్‌, కే.పీ.హెచ్‌.బీ ప్రాంతాల్లో 9959226149 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.