TSRTC MD Sajjanar on Mahalakshmi Scheme : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందున రాష్ట్ర మహిళలు ఆదరిస్తున్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు టీఎస్ఆర్టీసీ(TSRTC) బస్సుల్లో ప్రయాణించారు. రోజుకు సగటున 30 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. పురుషులతో సహా లెక్కిస్తే మొత్తంగా ప్రతి రోజూ 51 లక్షల మందిని సురక్షితంగా సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతోంది.
టీఎస్ఆర్టీసీలో నిత్యం ప్రయాణించే ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉంటున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్(TSRTC MD Sajjanar) తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణ స్కీం ఫలితంగా సంస్థ ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) గణనీయంగా పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో 69 శాతం ఓఆర్ ఉన్నది, ప్రస్తుతం అది 88 శాతానికి పెరిగిందని తెలిపారు. ఈ నెల 16వ తేదిన 17 డిపోలు, 17వ తేదిన 20 డిపోలు, 18వ తేదిన 45 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ నమోదయిందని స్పష్టం చేశారు.
-
*మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
*11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల ప్రయాణం
*ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం…
">*మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 20, 2023
*11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల ప్రయాణం
*ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం…*మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 20, 2023
*11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల ప్రయాణం
*ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం…
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్రెడ్డి - మహాలక్ష్మి పథకం ప్రారంభం
TSRTC Bus Journey Free for Womens in Telangana : గత మూడు రోజుల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుజురాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100 శాతం ఓఆర్ సాధించాయని సజ్జనార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9 వ తేది నుంచి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ స్కీంను టీఎస్ఆర్టీసీ అమలు చేస్తోంది.
సమర్థవంతంగా మహాలక్ష్మి పథకాన్ని(Mahalakshmi Scheme) అమలు చేసేందుకు ఈ నెల 15 నుంచి జీరో టికెట్లను మహిళలకు జారీ చేస్తోందని సజ్జనార్ తెలిపారు. ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందని, ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. కొందరు మహిళలు తమ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకురాలేదని సంస్థ దృష్టికి వచ్చిందన్నారు. గుర్తింపు కార్డుల ఫొటో కాపీలను తెస్తున్నారని, స్మార్ట్ఫోన్లలో సాప్ట్ కాపీలు చూపిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.
హామీల అమలుపై కొత్త సర్కార్ ఫోకస్ - రేపటి నుంచే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
TSRTC Interduce New Buses in Telangana : ఫొటో కాపీలను స్మార్ట్ ఫోన్లలో చూపిస్తే ఉచిత ప్రయాణానికి(Free Journey in TSRTC for Telangana Womens) అనుమతి ఉండదని, గుర్తింపు కార్డుల్లోనూ ఫొటోలు స్పష్టంగా కనిపించాలని సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా ఛార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలని తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని వెల్లడించారు. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో దాదాపు 2,050 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నామన్నారు. అందులో 1,050 డీజిల్ 1,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని, విడతల వారీగా ఆ బస్సులు వాడకంలోకి వస్తాయని పేర్కొన్నారు.
ఆర్టీసీకి సరికొత్త రికార్డ్ - ఒక్క రోజే 50 లక్షల మంది ప్రయాణం