ETV Bharat / state

TSRTC: ఊరూరా.. వాడవాడనా బస్​ ఆఫీసర్లు.. మరో వినూత్న కార్యక్రమానికి ​శ్రీకారం - tsrtc md press note

TSRTC Bus Officers in Villages: ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలను ఆకర్షించేందుకు గ్రామాల్లో బస్‌ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. ప్రయాణికుల సౌకర్యార్థం కల్పిస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించి.. టీఎస్​ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేలా ఈ వ్యవస్థకు రూపకల్పన చేసింది.

tsrtc bus officers
tsrtc bus officers
author img

By

Published : Apr 22, 2023, 10:11 PM IST

Updated : Apr 23, 2023, 6:22 AM IST

TSRTC: ప్రజలకు మరింత చేరువులో టీఎస్​ఆర్టీసీ.. గ్రామాల్లో ఇకపై బస్​ ఆఫీసర్లు

TSRTC Bus Officers in Villages: శతాబ్దానికి చేరువయ్యే చరిత్ర.. సురక్షిత ప్రయాణం.. ఉన్నతమైన ప్రమాణాలతో ప్రయాణికుల ఆదరాభిమానాలు చూరగొన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. ఆధునిక విధానాలు, సరికొత్త ఒరవడితో సేవలను అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటికే కార్గో లాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న టీఎస్​ఆర్టీసీ.. తాజాగా మరో వ్యవస్థ ఏర్పాటుకు సిద్ధమైంది. అదే విలేజ్‌ బస్‌ ఆఫీసర్ల నియామకం. ఆర్టీసీని ప్రజల చెంతకు తీసుకువెళ్లేందుకు గ్రామాల్లో వీరిని నియమించాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ జారీ చేశారు.

మే 31 నుంచి అమల్లోకి: ఈ వ్యవస్థ మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పిన ఆయన.. వీలైనంత త్వరగా బస్‌ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. గ్రామాల్లో నివసించే ఆర్టీసీలో పని చేసే కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్‌ బస్‌ ఆఫీసర్లుగా డిపో మేనేజర్లు నియమిస్తారు. ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలుండి.. స్వచ్ఛందంగా పని చేసేందుకు ముందుకు వచ్చే వారికి నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.పెద్ద గ్రామానికైతే ఒకే బస్‌ ఆఫీసర్‌ ఉండనున్నారు. చిన్న గ్రామాలైతే రెండు, మూడింటికి కలిపి ఒకరిని నియమిస్తారు.

గ్రామస్థులతో నిత్యం అందుబాటులో ఉంటారు: ఈ మార్గదర్శకాల ప్రకారం ఒక్కరికి 5 గ్రామాల కంటే ఎక్కువగా కేటాయించేందుకు అవకాశం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. హైదరాబాద్‌ సహా మిగతా పురపాలికల్లోనూ వార్డుకో బస్‌ ఆఫీసర్‌ను అధికారులు నియమించనున్నారు. వారు ఆయా వార్డుల పరిధిలో విలేజ్‌ బస్‌ ఆఫీసర్లలాగే పని చేస్తారు. వీరంతా గ్రామస్థులకు నిత్యం అందుబాటులో ఉండనుండగా.. 15 రోజులకోసారి వారితో సమావేశమవుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్‌లు, కొత్త సర్వీస్‌లు, సమస్యలు, ఇతర అంశాల గురించి సమాచారాన్ని సేకరించి.. పైఅధికారులకు చేరవేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో వివాహాలు, శుభకార్యాలు, జాతరల వివరాలను ముందే అధికారులకు తెలియజేసి.. రద్దీ ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్టుగా సేవలను పెంచే అవకాశం ఉంటుంది. ఆయా సందర్భాల్లో జనం ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ అద్దె బస్సులను ఉపయోగించుకోవాలని ప్రజలకు వివరిస్తారు.

గ్రామ పంచాయతీలో ఆఫీసర్ల వివరాలు: గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సంఘాల నాయకులు, మహిళా సంఘాల సభ్యులతో పాటు ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులను ఈ బస్‌ ఆఫీసర్లు సంప్రదించి.. ప్రజా రవాణా వ్యవస్థతో పాటు ఆర్టీసీ అందిస్తున్న సేవలను వివరించాల్సి ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డులో సంబంధిత విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ వివరాలు పొందుపర్చుతారు. అలాగే ఈ బస్‌ ఆఫీసర్ల పనితీరును బట్టి వారికి ప్రోత్సాహకం అందించాలని సంస్థ నిర్ణయించింది. ప్రతి మూడు నెలలకోసారి వారి పనితీరు గుర్తించి సత్కరించనుంది.

10 వేల గ్రామాల్లో ఆర్టీసీ సేవలు: గ్రామాలకు నడిచే సర్వీసులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా.. శుభ కార్యాలకు అద్దె బస్సులను బుక్‌ చేసుకోవాలన్నా డిపోలకు వెళ్లాల్సి ఉంటుంది. దూరంగా ఉండే వారు ఈ సేవలను ఉపయోగించుకోట్లేదు. తాజాగా ఆర్టీసీ నియమిస్తున్న గ్రామ అధికారులతో ఈ సమస్య తీరనుంది. ప్రజలకు, సంస్థకు ఈ అధికారులు అనుసంధాన కర్తల్లా పని చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 10 వేల గ్రామాలకు ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటికి అనుగుణంగా 2 వేలకు పైగా బస్‌ ఆఫీసర్లను నియమించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటి వరకు సంస్థ శ్రీకారం చుట్టిన కార్యక్రమాలను ప్రజలు ఎంతో ఆదరించారని.. ఇదే తీరుగా విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ వ్యవస్థను ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్‌ కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 23, 2023, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.