ETV Bharat / state

TSRTC PROFITS: దసరా పండుగ.. ఆర్టీసీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా? - dasara festival

దసరా పండుగ టీఎస్ఆర్టీసీకి(TSRTC) ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అసలే నష్టాల్లో కూరుకుపోయి నానా అవస్థలు పడుతున్న సంస్థకు ఊపిరిపోసింది. పండుగ సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సులతో టీఎస్​ఆర్టీసీకి రూ. 3.36 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

TSRTC PROFITS
దసరా పండుగ టీఎస్ఆర్టీసీకి పెరిగిన ఆదాయం
author img

By

Published : Oct 18, 2021, 7:57 PM IST

బతుకమ్మ పండుగ ఆర్టీసీకి ప్రాణం పోసింది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే ఈ పండుగ టీఎస్​ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. దసరాను పురస్కరించుకుని రవాణాశాఖ అధికారులు నడిపిన ప్రత్యేక బస్సులతో ఆదాయం అమాంతం పెరిగింది. పండుగ సీజన్​లో మొత్తం రూ.3.36 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

బతుకమ్మ పండుగ సందర్బంగా ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఈనెల 8వ తేదీ నుంచి 15 వరకు 3 వేలకు పైగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మొదటి రోజు ప్రత్యేక బస్సుల్లో అధిక శాతం ఛార్జీలు వసూలు చేశారు. ఆ తర్వాత ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ఆదేశాలు జారీ చేశారు. ఆ నిర్ణయంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. పండుగ వేళ ఆర్టీసీకి ఆదాయం పెరగడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సజ్జనార్ ప్రత్యేక దృష్టి

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్​ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతే ధ్యేయంగా ఆర్టీసీ సేవలందిస్తుందని సజ్జనార్​ వెల్లడించారు. ప్రయాణికులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్‌ సూచించారు.

సలహాల కోసం ట్విట్టర్​ ఖాతా

టీఎస్ఆర్టీసీ(Tsrtc)కి ప్రయాణికులే పరమావధిగా భావిస్తూ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(tsrtc md sajjanar)​ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రయాణికుల నుంచి సూచనలు, సలహాలు, ఆర్టీసీలో ఎదురయ్యే ఇబ్బందులు, సంస్థ అభివృద్దికి సలహాలు, సంస్థ లోపాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు చర్యలు చేపట్టారు. అందుకోసం ఓ ట్విట్టర్ ఖాతా(Tsrtc twitter)ను కూడా ప్రారంభించి పలువురి సలహాలను, సూచనలను స్వీకరిస్తున్నారు.

ఇదీ చూడండి:

SAJJANAR: 'సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొస్తా.. ఆర్టీసీ సొంతంగా నిలబడేలా చేస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.