ETV Bharat / state

నష్టాల నుంచి లాభాల్లోకి ఆర్టీసీ.. కారణం ఏంటీ ?

ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల బాటలోకి అడుగుపెడుతోంది. 2019 డిసెంబర్​ నెలను ఆర్టీసీ చరిత్రలో లిఖించదగినదిగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా లాభాలను అందుకుంది. ఇంతకుముందు ఆర్టీసీ రోజుకు రూ. 2 కోట్ల వరకు నష్టాలు రాగా.. గతేడాది డిసెంబర్​లో రోజుకు కోటి వరకు లాభాల్ని అర్జించింది.

నష్టాల నుంచి లాభాల్లోకి ఆర్టీసీ.. కారణం ఏంటీ ?
నష్టాల నుంచి లాభాల్లోకి ఆర్టీసీ.. కారణం ఏంటీ ?
author img

By

Published : Feb 14, 2020, 5:00 AM IST

Updated : Feb 14, 2020, 7:08 AM IST

ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇందుకు 2019 డిసెంబర్ నెల వేదికయ్యింది. ఈ నెలలో ఆర్టీసీకి ఏకంగా రూ. 32.01 కోట్ల లాభాలు వచ్చాయి. 2018 డిసెంబర్​లో మాత్రం 72.84 కోట్ల నష్టం వాటిల్లింది. ఒక్క ఏడాదిలో ఆర్టీసిలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సమ్మె తర్వాత ఉద్యోగుల్లో చాలా మార్పు కన్పిస్తోంది. అధికారులు అనేక సంస్థాగత నిర్ణయాలు తీసుకున్నారు.

ఛార్జీలు పెంచడమే..

ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేందుకు ప్రధాన కారణం ఛార్జీలు పెంచడమే. ఈ పెంపుతో ఏడాదికి సుమారు రూ. 750 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేశారు. ఊహించినట్లుగానే ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం చాలా తగ్గింది. ఛార్జీల పెంపుతో ఆర్టీసీకి నిజంగానే ఊరట లభించింది.

మేడారంతో మరింత లాభాలు:

2018 అక్టోబర్​లో 356 కోట్లు, నవంబర్​లో 461.06 కోట్లు, డిసెంబర్​లో 533.90 కోట్లను అర్టీసి నష్టాలను మూటగట్టుకుంది. 2019 అక్టోబర్​లో 486.62 కోట్లు, నవంబర్​లో 436.43 కోట్లు, డిసెంబర్​లో 404.42 కోట్లు నష్టాలు తగ్గాయి. అంటే గతేడాదితో పోల్చితే.. లాభాల్లోకి అడుగుపెట్టినట్లే అని అధికారులు భావిస్తున్నారు. జనవరి నెలలో సంక్రాంతి పండుగ, ఫిబ్రవరిలో సమ్మక్క-సారక్క జాతరతో ఖచ్చితంగా లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చూడండి: '530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తి పోసేలా సిద్ధంకండి'

Last Updated : Feb 14, 2020, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.