ETV Bharat / state

TSPSC Group 1 Results : 'అప్పటి వరకు.. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇవ్వం' - గ్రూప్ 1 ప్రిలిమ్స్

TSPSC Group 1 Prelims Results 2023 : గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. టీఎస్పీఎస్సీ వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు సమయం కోరింది. అప్పటి వరకు గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇవ్వబోమని కోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి వాయిదాను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

TSPSC
TSPSC
author img

By

Published : Jul 25, 2023, 2:26 PM IST

Updated : Jul 25, 2023, 3:24 PM IST

TSPSC Group 1 Prelims Results 2023 : గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిష్​పై టీఎస్పీఎస్సీ కౌంటర్ దాఖలు చేసింది. వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు సమయం కోరింది. అయితే అప్పటి వరకు గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇవ్వబోమని కోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి వాయిదాను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

TSPSC Group 1 prelims Primary Key : టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజ్​ కారణంగా 2022 అక్టోబర్​ 16న జరగాల్సిన గ్రూప్​-1 పరీక్ష.. ఎన్నో అవంతరాలు ఎదుర్కొని ఈ సంవత్సరం జూన్​ 11న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను పక్బంధీగా నిర్వహించారు. అనంతరం జూన్​ 28న గ్రూప్​-1 ప్రిలిమ్స్​ ప్రాథమిక కీను టీఎస్​పీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల ఓఎంఆర్​ షీట్లను వెబ్​సైట్​లో ఉంచింది. ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఈ అభ్యంతరాలను ఆంగ్లంలో మాత్రమే తెలపాలని టీఎస్​పీఎస్సీ సూచనలు ఇచ్చింది. 2,33,056 మంది అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీఎస్​పీఎస్సీ తెలిపింది. ఓఎంఆర్​ షీట్లులను ఈ నెల 27 వరకు వెబ్​సైట్​లో ఉంచనున్నట్లు పేర్కొంది. జూన్​ 11న జరిగిన గ్రూప్​-1 పరీక్షను గతంలో రాసిన దానికంటే 50 వేల మంది తక్కువ రాసినట్లు టీఎస్​పీఎస్సీ తెలిపింది. గ్రూప్​-1 ప్రిలిమ్స్ ఫలితాలు అనంతరం మూడు నెలలు వ్యవధిలో మెయిన్స్​ ఎగ్జామ్​ నిర్వహిస్తారని టీఎస్​పీఎస్సీ గతంలో తెలిపింది.

TSPSC Group 1 Hall Ticket Controversy : అప్లై చేయకుండానే గ్రూప్‌-1 హాల్‌టికెట్.. TSPSC మాత్రం..

TSPSC Group 1 Exam Controversy in Telangana : జూన్​ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్​ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు.. బయోమెట్రిక్ వివరాలు సేకరించలేదని పిటిషనర్లు తమ పిటిషన్​లో పేర్కొన్నారు. హాల్‌టికెట్ నంబర్‌, ఫొటో లేకుండా ఓఎంఆర్ షీటు ఇచ్చారని పిటిషనర్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 503 పోస్టులకు నిర్వహిస్తున్న గ్రూప్-1కు.. 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఉదయం 10.30 గంటల మొదలైన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష జరిగింది. ఉదయం 8.30 నుంచి 10.15 వరకు మాత్రమే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. 10.15 గంటల తర్వాత వచ్చిన వారిని ఆలస్యమైందంటూ.. పరీక్ష రాయటానికి అధికారులు అనుమతించలేదు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి :

Last Updated : Jul 25, 2023, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.