TSPSC latest notifactions: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా ఇవాళ మరో నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పురపాలకశాఖలో 78 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
- విద్యాశాఖలో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ కమిషనరేట్‌లో 40 లైబ్రేరియన్ పోస్టులు, సాంకేతిక విద్యాశాఖలో 31 లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
- కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. మే లేదా జూన్‌లో నియామక పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
- 113 అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. మే లేదా జూన్‌లో నియామక పరీక్షఉంటుందని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.