ETV Bharat / state

టీఎస్​పీఎస్సీ బోర్డు సభ్యుడు కారం రవీందర్​రెడ్డి రాజీనామా

TSPSC Member Karam Ravinder Reddy Resigned Today : టీఎస్​పీఎస్సీ బోర్డులో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పబ్లిక్ సర్వీస్​ కమిషన్ సభ్యుడు కారం రవీందర్​రెడ్డి రాజీనామా చేశారు. ఇద్దరు వ్యక్తుల తప్పిదం వల్ల సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

TSPSC Latest News
TSPSC Member Karam Ravinder Reddy Resigned Today
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 7:51 PM IST

TSPSC Member Karam Ravinder Reddy Resigned Today : గత ప్రభుత్వంలో వరుస పేపర్​ లీకేజీలతో సంచలనంగా మారిన టీఎస్​పీఎస్సీ(TSPSC) బోర్డులోని సభ్యుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా బోర్డు సభ్యుడు కారం రవీందర్​రెడ్డి రాజీనామా చేశారు. కమిషన్​లో చోటు చేసుకున్న అపవాదును సంబంధంలేని వారు కూడా మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా - అశోక్​నగర్​లో నిరుద్యోగుల సంబురాలు

ఇద్దరు వ్యక్తుల తప్పిదంవల్ల బోర్డు మనుగడే ప్రశ్నార్థకంగా మారందని కారం రవీందర్​రెడ్డి పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తుల స్వార్థపూరిత ఆలోచనలకు అనుగుణంగా పనిచేయలేదనే సంస్థలో జరిగిన పరిణామాలను తమకు ఆపాదించారని విమర్శించారు. టీఎస్​పీఎస్సీలో సరిపడా సిబ్బంది లేకపోయినా నిరుద్యోగులకు మంచి జరగాలనే ఉద్దేశంతో నియామక ప్రక్రియ వేగమంతం చేశామన్నారు. నిరుద్యోగులకు సంస్థపై ఉన్న అపోహను పక్కన పెట్టాలని పేర్కొన్నారు.

TSPSC Latest News : టీఎస్​పీఎస్సీలో వరుస పెట్టి ప్రశ్నాపత్రాలు లీకవడం సంచలనంగా మారాయి. గ్రూప్​-1, ఏఈఈ, డీఏవో ప్రశ్నపత్రాలను కమిషన్​ ఉద్యోగులు ప్రవీణ్​, రాజశేఖర్​రెడ్డిలు లీక్​ చేశారు. గత ప్రభుత్వం హయాంలో సిట్​ను నియమించి లీకేజీలో భాగస్వాములైన వారందరినీ అరెస్టు చేశారు. రెండోసారి గ్రూప్​-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించగా, కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో పరీక్షను రద్దు చేయాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో నిరుద్యోగుల్లో బోర్డుపై సమ్మకం పూర్తిగా పోయింది. కమిషన్​ను రద్దు చేయాలని, బోర్డు పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం ఆదేశం - యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల కమిషన్ల అధ్యయనానికి ఆదేశం

గత బీఆర్​ఎస్​(BRS) ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్​ కమిషన్​ సభ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన నిరుద్యోగులు పలుమార్లు ధర్నాకు దిగారు. ఎన్నికల ముంగిట టీఎస్​పీఎస్సీ అంశం మరింత హాట్​ టాపిక్​గా మారింది. తాము అధికారంలోకి రాగానే టీఎస్​పీఎస్సీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్​ పార్టీ హామీ ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా జాబ్​ క్యాలెండర్​ సైతం ప్రకటించింది.

తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఎస్​పీఎస్సీపై దృష్టి సారించింది. సీఎం రేవంత్​రెడ్డితో పబ్లిక్​ సర్వీస్ కమిషన్​ ఛైర్మన్​ జనార్దన్​రెడ్డి సమావేశమైన కొన్ని గంటల్లోనే ఛైర్మన్​ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు యూపీఎస్సీ విధానంపై అధ్యయనం చేయాలని రేవంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల పబ్లిక్​ సర్వీస్​ కమిషన్లపై అధ్యయనం చేయాలని, సమగ్ర అధ్యయం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు.కమిషన్​లో పేపర్‌ లీకేజీలు సహా ఉద్యోగాల భర్తీ తీరుపై పూర్తి స్థాయి విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా - ఆమోదించని గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.