TSPSC Appeal Petition Against Group 1 Prelims Cancellation on Monday : గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష(Group1 Prelims Exam) రెండోసారి నిర్వహణ లోపాల వల్లే హైకోర్టు(Telangana High court) ఆ పరీక్షను రద్దు చేసిందని ఎన్ఎస్యూఐ(NSUI) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు హర్షవర్దన్, రియాజ్ ఆరోపించారు. రెండుసార్లు పరీక్షలు నిర్వహించినా.. లోపభూయిష్టంగా జరిపారని విమర్శించారు. వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)ను ప్రక్షాళన చేయాలని హైకోర్టు చెప్పిందని.. ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
"ఈ తప్పిదం రాష్ట్ర ప్రభుత్వానిది కాబట్టి.. తక్షణమే టీఎస్పీఎస్సీని రద్దు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత తీసుకోవాలి. అలాగే గ్రూప్-1 అభ్యర్థులకు రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలి. బోర్డు సభ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకొని క్రమంలో నిరుద్యోగులతో కలిసి తీవ్రమైన ఉద్యమం చేస్తాం." - బల్మూరి వెంకట్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు
Group1 Prelims update : గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్
TSPSC Group 1 Prelims Exam Cancelled : గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండోసారి రద్దు కావడం టీఎస్పీఎస్సీ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తక్షణమే సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు. తొలిసారి పేపర్ లీకైనా నిస్సిగ్గుగా అదే బోర్డును కొనసాగించారని.. అయినా రెండోసారి పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ నమోదు చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటమేంటని ప్రశ్నించారు.
TSPSC Group 1 Prelims Exam 2023 Cancelled : నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని.. తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. మినీ డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో డీఎస్సీ నిరుద్యోగులు నిర్వహించిన సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు. విద్యార్థులు వ్యయ ప్రయాసలకు ఓర్చి పరీక్షలకు సిద్ధమవుతున్నారని.. వారి ఖర్చులను ఎవరు భరిస్తారని కోదండరాం ప్రశ్నించారు.
"గ్రూప్-1 పరీక్షను మళ్లీ రద్దు చేసింది హైకోర్టు. నోటిఫికేషన్లో ఏ విషయాలు అయితే చెప్పారో అలా పరీక్ష విధానం జరగలేదని హైకోర్టు తెలిపింది. దీంతో నిరుద్యోగులకు మరోసారి అన్యాయం జరిగింది. ఏ విషయంపై కూడా ఈ ప్రభుత్వం స్పందించదు. ఇప్పటికైనా స్పందిస్తే బాగుంటుంది. ఈ సారి ఎన్నికల్లో నిరుద్యోగులను ఒక శక్తిగా మారుస్తాం." - కోదండరాం, తెలంగాణ జన సమితి అధినేత
High Court Cancel TSPSC Group 1 Prelims Exam : ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాశామని, మూడోసారి రాయడమంటే ఎలా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి పరీక్ష అంటే లక్షలాది మంది మానసికంగా ఇబ్బందులకు గురవుతారని టీఎస్పీఎస్సీ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై.. డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు న్యాయనిపుణులతో సమావేశమై సోమవారం అప్పీలు దాఖలు చేయనున్నట్లు తెలిసింది.