TSPSC Appeal Hearing on Group 1 Cancel : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్(Group-1 Preliems Exam) రద్దుపై హైకోర్టుశ్(High Court) డివిజన్ బెంచ్‌లో విచారణ రేపటికి (బుధవారం) వాయిదా పడింది. బయోమెట్రిక్ ఎందుకు పాటించలేదని హైకోర్టు మరోసారి ప్రశ్నించింది. సాంకేతిక కారణాల వల్లే బయోమెట్రిక్ పాటించలేదని హైకోర్టులో ఏజీ వెల్లడించారు. బయోమెట్రిక్(Biometric) పాటించకపోవడం వల్ల అభ్యర్థులకు నష్టంలేదని పేర్కొన్నారు. ఇదొక్కటే కారణంగా చూపించి.. మొత్తం పరీక్షను రద్దు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ మేరకు రెండు లక్షల మంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వొకేట్ జనరల్‌ను(Advocate General) ఆదేశిస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
Telangana HC on TSPSC Over Group 1 Exam : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో టీఎస్‌పీఎస్సీ(TSPSC) దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ అమలు చేయడం వల్ల ఇబ్బందేమిటని కమిషన్‌ను ప్రశ్నించింది. గతంలో అలా అమలు చేసిన పరీక్షల వివరాలను తెలపాలని ఆదేశించింది.
Telangana HC Questions TSPSC Over Group 1 Exam : నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన ధర్మాసనం.. 'మీ నోటిఫికేషన్‌ను మీరే అమలు చేయకపోతే ఎలా' అని నిలదీసింది. ఒకసారి పరీక్ష రద్దయ్యాక మరింత జాగ్రత్తగా ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీకి ఉందన్న హైకోర్టు.. అభ్యర్థుల భవిష్యత్తు, టీఎస్‌పీఎస్సీ ప్రతిష్ఠ ప్రశ్నార్థకంగా మారాయని పేర్కొంది.
Group1 Prelims update : గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్