ETV Bharat / state

గవర్నర్​కు టీఎస్​పీఎస్​సీ వార్షిక నివేదిక - tspsc latest updates

2018- 19 వార్షిక నివేదికను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్... గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​కు సమర్పించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీఎస్​పీఎస్​సీ ఛైర్మన్.. గవర్నర్​కు వివరించారు.

గవర్నర్​కు టీఎస్​పీఎస్​సీ వార్షిక నివేదిక

author img

By

Published : Sep 23, 2020, 10:17 PM IST

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​కు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018- 19 వార్షిక నివేదికను సమర్పించింది. టీఎస్​పీఎస్​సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్​కు వివరించారు. 2018- 19లో 3, 276 ఉద్యోగాల భర్తీ కోసం 18 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసినట్లు చక్రపాణి వివరించారు.

19 లక్షల 91వేల మంది అభ్యర్థులు వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగా... 15, 994 మంది ఎంపికయ్యారని గవర్నర్​కు తెలిపారు. దరఖాస్తులు, పరీక్షలు, ముఖాముఖిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు తెలిపారు. టీఎస్​పీఎస్​సీ చేపట్టిన సంస్కరణలను గవర్నర్ అభినందించారని చక్రపాణి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.