TSIIC: తెలంగాణ ఏర్పాటైన ఏడేళ్లలోనే టీఎస్ఐఐసీ ద్వారా 28 వేల ఎకరాల్లో 152 కొత్త ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి జరిగిందని ఆ సంస్థ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు వెల్లడించారు. భారీ పెట్టుబడులతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాది అవకాశాలను కల్పించే మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్టులతో పాటు స్థానికులకు ఎక్కువ మందికి ఉపాధిని చూపించే సూక్ష్మ,చిన్నమధ్యతరహా పరిశ్రమలను ప్రొత్సహించేందుకు టీఎస్ ఐఐసీ అన్ని జిల్లాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ది చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
శుక్రవారం పరిశ్రమ భవన్లో టీఎస్ఐఐసీ-2022 డైరీని సంస్థ ఎండీ వెంకట్ నర్సింహారెడ్డితో కలిసి టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు టీఎస్ఐఐసీ ఇండస్ట్రియల్ పార్కులలో 3197 పరిశ్రమలను నెలకొల్పడానికి 2431 ఎకరాలను కేటాయించగా, తద్వారా రూ.33,447 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించడం ద్వారా 3.12 లక్షల మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: