రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు సాధారణంగానే ఉన్నాయని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి అన్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల కోసం రెండు వేల కోట్లు మాత్రమే ఇవ్వడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ప్రతి ఏటా రూ.5 వేల కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర వార్షిక బడ్జెట్లో పాఠశాల విద్యకు గతంలో మాదిరి రూ.11,735 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, నూతన ఉపాధ్యాయుల నియామకం, కొవిడ్ వల్ల ఆన్లైన్ విద్య మెరుగవ్వాలంటే నిధులు ఏమాత్రం సరిపోవని తెలిపారు. పాఠశాలల బలోపేతం కోసం మరిన్నీ నిధులు ఇవ్వాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.