ETV Bharat / state

నేటి నుంచి ఆర్టీసీ అంతర్​ రాష్ట్ర సర్వీసులు ప్రారంభం

author img

By

Published : Jun 21, 2021, 5:17 AM IST

రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో టీఎస్​ఆర్టీసీ అంతర్​ రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించింది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు బస్సులు నడిపించనున్నట్లు అధికారులు ప్రకటించారు. బెంగుళూరు మినహా కర్ణాటకలోని దాదాపు గతంలో తిప్పిన అన్ని ప్రాంతాలకు బస్సులను నడపనున్నారు. మహారాష్ట్రకు మాత్రం రేపటి నుంచి బస్సులు నడుపనున్నారు. ఆయా రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు , ప్రయాణికుల రద్దీకీ అనుగుణంగా బస్సులు నడిపిస్తామని అధికారులు తెలిపారు.

ts rtc, interstate services
ఆర్టీసీ, అంతర్​ రాష్ట్ర సర్వీసులు

రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో అంతర్​ రాష్ట్ర సర్వీసులనూ నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సులను తిప్పనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బెంగళూరుకు మాత్రం బస్సులను తిప్పడంలేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. మహారాష్ట్రలో వారాంతపు కర్ఫ్యూ అమలవుతోంది. ఈ తరుణంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండడం వల్ల ఆ సమయంలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు రోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడిపిస్తామని ఆర్టీసీ వెల్లడించింది.

ఆయా రాష్ట్రాల నిబంధనల ప్రకారం

లాక్​డౌన్​కు ముందు టీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్​కు సుమారు 600 బస్సులు కర్ణాటకకు సుమారు 200 బస్సులు, మహారాష్ట్రకు సుమారు 130 బస్సులను తిప్పేది. మహారాష్ట్రలోని గమ్యస్థానాలకు అక్కడి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా బస్సులు నడిపిస్తామని అధికారులు తెలిపారు. మహారాష్ట్రకు మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతామని స్పష్టం చేశారు. కాబట్టి ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు కొనసాగించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.

డిమాండ్​కు అనుగుణంగా బస్సులు

ప్రస్తుతం ప్రయాణికుల డిమాండ్​కు అనుగుణంగా బస్సులను తిప్పేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల బస్సులను తిప్పుతున్నామని తెలిపారు. అంతరరాష్ట్ర బస్సులను తిరిగి పునరుద్ధరించడంతో ఆర్టీసీకి మరింత ఆదాయం కలిసివచ్చే అవకాశముందని యాజమాన్యం అభిప్రాయపడుతుంది.

ఇదీ చదవండి: HARISH: హరీశ్‌ రావు కాన్వాయ్‌కి ప్రమాదం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.