ETV Bharat / state

పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ - ఆన్​లైన్​ క్లాసుల నిర్వహణ తాజా వార్తలు

పాఠశాలల ప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్​ చిత్రరామచంద్రన్​ పేర్కొన్నారు.

ts-ministry-of-education-says-no-decision-yet-on-the-opening-of-schools
పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ
author img

By

Published : Jul 2, 2020, 8:49 AM IST

Updated : Jul 2, 2020, 2:39 PM IST

రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆన్​లైన్​ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీచేయలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్​ చిత్రరామచంద్రన్​ స్పష్టం చేశారు. పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు.

విద్యాసంత్సరం, ఆన్​లైన్​ తరగతులపై ఎలాంటి ఉత్తర్వులు, ప్రకటనలు ఇవ్వద్దని డీఈవోలకు చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే.. చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆన్​లైన్​ తరగతులపై నిన్న హైకోర్టులో విచారణ సందర్భంగా కొన్ని జిల్లాల్లో డీఈవోలు పత్రిక ప్రకటనలు జారీ చేశారని పిటిషనర్​ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ప్రభుత్వం ఎలాంటి విధానం రూపొందించకుండా.. డీఈవోలు ప్రకటనలు ఎలా ఇస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో డీఈవోలకు స్పష్టతనిస్తూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

Last Updated : Jul 2, 2020, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.