ETV Bharat / state

'ప్రతి పంటలో చివరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది' - Ts_Markfed_Chairman_On_Agricultural_Purchases

హైదరాబాద్​ జాంబాగ్​లో టీఎస్ మార్క్​ఫెడ్​ సంస్థ కార్యాలయంలో తెలంగాణ సహకార మార్కెటింగ్​ సమాఖ్య అధ్యక్షుడు మార గంగారెడ్డి అధికారులతో సమావేశమయ్యారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి పంటలోని ఆఖరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు.

ts-markfed-chairman-on-agricultural-purchases
'ప్రతి పంటలో చివరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది'
author img

By

Published : Apr 21, 2020, 4:58 PM IST

కేంద్రం అనుమతి కోటా పూర్తయినందున సీఎం ఆదేశాల మేరకు నేటి నుంచి జొన్న, పొద్దుతిరుగుడు, శనగ పంటల ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్​ సమాఖ్య అధ్యక్షుడు మార గంగారెడ్డి అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయం సడలింపు అవకాశాలు ఎవరూ దుర్వినియోగం చేయవద్దని... పంట క్షేత్రాలకు వెళ్లాక భౌతిక దూరం పాటించాలని హైదరాబాద్​ జాంబాగ్​లో టీఎస్ మార్క్​ఫెడ్​ సంస్థ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు.

దశలవారీగా నగదు చెల్లింపు

రైతుల ప్రయోజనాలు దృష్ట్యా మూడు రకాల పంట ఉత్పత్తులను ప్రభుత్వం అదనంగా కొనుగోలు చేస్తోందన్నారు. గత ఖరీఫ్​లో కొనుగోలు చేసిన పెసలు, సోయా, కందులు, శనగకు దశలవారీగా నగదు చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా రబీ మార్కెటింగ్​లో మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు, కందులు, జొన్న విక్రయాలు చురుకుగా సాగుతున్నాయని చెప్పారు.

మే 5 నుంచి విక్రయాలు...

కేటాయింపులకు అనుగుణంగా రాబోయే ఖరీఫ్​ కోసం 4.52 లక్షల టన్నుల రసాయన ఎరువులు జిల్లాలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మే 5 నుంచి దుకాణాల్లో విక్రయాలు చేపట్టేందుకు డీలర్లకు అనుమతివ్వనున్నట్లు గంగారెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.