వార్షిక బడ్జెట్ సమావేశాలు గవర్నర్ తమిళిసై ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి తమిళిసై మొదటిసారిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటైన తొలినాళల్లో తీవ్రమైన విద్యుత్ సమస్యను ఎదుర్కొందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రైతుల ఆత్మహత్యలు, వలసలు ఉండేవని చెప్పారు.
విద్యుత్, నీరు, ఎరువుల పరంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. తాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు ఉండేవని గుర్తు చేశారు. పక్కా ప్రణాళికతో కేసీఆర్ సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపారని ప్రశంసించారు. తక్కువ కాలంలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా ఎదిగిందని కొనియాడారు.