ETV Bharat / state

ఆ 343 మంది అభ్యర్థుల పత్రాలు పున: సమీక్షించండి

గ్రూప్‌-2లో బబ్లింగ్‌, వైట్‌నర్‌ వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని టీఎస్‌పీఎస్సీకి సూచించింది. ఈ నిర్ణయాన్ని టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ చక్రపాణి స్వాగతించారు.

ఆ 343 మంది అభ్యర్థుల పత్రాలు పునర్ సమీక్షించండి
author img

By

Published : Jun 3, 2019, 12:56 PM IST

Updated : Jun 3, 2019, 4:57 PM IST

గ్రూప్‌-2 నియామకాలకు లైన్​ క్లియర్​

మూడేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న గ్రూప్‌-2 నియామక ఎంపిక ప్రక్రియకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గతంలో జాబితా నుంచి తొలగించిన 343 మంది అభ్యర్థుల పత్రాలను పునర్‌సమీక్షించాలని టీఎస్‌పీఎస్సీని న్యాయస్థానం ఆదేశించింది. ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్, వైట్‌నర్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.

ఆ 343 మంది అభ్యర్థుల పత్రాలు పున: సమీక్షించండి

తక్షణమే ప్రక్రియ చేపట్టండి

హైకోర్టు ఆదేశాలతో గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ వెంటనే చేపట్టేందుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 1032 గ్రూప్ 2 ఉద్యోగాల కోసం 2016 నవంబరులో రాతపరీక్ష నిర్వహించింది. సుమారు ఐదు లక్షల మంది పరీక్ష రాయగా... ధ్రువపత్రాల పరిశీలన కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున 3వేల 147 మందిని ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది.

హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌

ఇప్పటికే 3147 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల వెరిఫికేషన్‌ ముగింది. ఈ తీర్పులో 1:2 రేషియో పద్ధతిలో ఇంటర్వ్యూలు జరుపనున్నారు. హైకోర్టు తీర్పుపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి హర్షం వ్యక్తం చేశారు. తీర్పును స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. 343 మంది అభ్యర్థుల పత్రాలను పునర్ పరిశీలించిన తరువాత.... త్వరలోనే మెరిట్‌ జాబితా, ఇంటర్వ్యూ తేదీలను ప్రకటిస్తామన్నారు.

ఇవీ చూడండి: స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం

Last Updated : Jun 3, 2019, 4:57 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.