ETV Bharat / state

'జాతీయ రహదారులన్నీ పచ్చదనంతో కళకళలాడాలి' - రహదారుల వెంట నర్సరీల ఏర్పాటు

హైదరాబాద్​ అరణ్యభవన్​లో అటవీశాఖ, నేషనల్​ హైవేస్​, ఆర్​ అండ్​ బీ అధికారులు సమావేశమయ్యారు. జాతీయ రహదారుల వెంట 40 నర్సరీలు, రాష్ట్ర హైవేస్​లో 69, రోడ్లు- భవనాల శాఖ పరిధిలోకి వచ్చే రహదారుల వెంట 141 నర్సరీలు... మొత్తం 250 నర్సరీలను ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు.

ts-governments-decision-to-set-up-nurseries-along-the-highways
'జాతీయ రహదారులన్నీ పచ్చదనంతో కళకళలాడాలి'
author img

By

Published : Jun 26, 2020, 8:06 PM IST

రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులు పచ్చదనంతో నిండాలని, అవసరం మేరకు రోడ్ల వెంటనే నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముఖ్యమంత్రి ఆదేశాలతో అటవీశాఖ, నేషనల్​ హైవేస్​, ఆర్​ అండ్​ బీ అధికారులు హైదరాబాద్​ అరణ్యభవన్​లో సమావేశమయ్యారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్​.శోభ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాలను వెంటనే అమలు చేయాలని నర్సరీల సంఖ్య, నెలకొల్పే ప్రదేశాలను ఖరారు చేయాలని నిర్ణయించారు.

జాతీయ రహదారుల వెంట 40 నర్సరీలు, రాష్ట్ర హైవేస్​లో 69, రోడ్లు- భవనాల శాఖ పరిధిలోకి వచ్చే రహదారుల వెంట 141 నర్సరీలు... మొత్తం 250 నర్సరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యుత్, నీటిసౌకర్యం ఉన్న ప్రదేశాలలో మాత్రమే నర్సరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కో నర్సరీలో 40 వేల చొప్పున మొత్తంగా కోటి మొక్కలు పెంచాలని తెలిపారు. ఈ నర్సరీల ఏర్పాటుకు ఉపాధి హామీ పథకం నుంచే నిధులను వాడుకునేలా ప్రణాళికలు సిద్దం చేయాలని చెప్పారు. వెంటనే నర్సరీలను ప్రారంభించి.. వచ్చే సీజన్ కల్లా మొక్కలు నాటేలా ప్లాన్ చేయాలని అధికారుల బృందం నిర్ణయించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.