ETV Bharat / state

తెలంగాణ సర్కారు కానుక.. నేడే 'ఆరోగ్య మహిళ'కు శ్రీకారం

Arogya Mahila Scheme: కట్టుకున్న భర్తకు తలనొప్పి వచ్చినా... కన్నబిడ్డకు జ్వరం వచ్చినా తల్లడిల్లుతుంది. ఇంట్లో వారికి నలతగా ఉంటే ఆస్పత్రులకు పరుగులు తీస్తుంది. ప్రతి ఒక్కరికి తలలో నాలుకలా ఉన్నా.. అందరి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకున్నా.. ఆమె ఆరోగ్యానికి మాత్రం ఎప్పుడూ ప్రాధాన్యత లేదు. తనగురించి తాను పట్టించుకునే సమయం లేకనో... ఆర్థిక స్థోమత సరిపోదనో.. ఆస్పత్రుల్లో మగ వైద్యులు ఉంటారనో... కారణం ఏదైనా మహిళల అనారోగ్య సమస్యలు మరుగునపడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువస్తోంది తెలంగాణ సర్కారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

ts government launch arogya mahila scheme in telangana on womens day
తెలంగాణ సర్కారు కానుక
author img

By

Published : Mar 8, 2023, 2:20 AM IST

Updated : Mar 8, 2023, 6:42 AM IST

Arogya Mahila Scheme: యుక్త వయసు నుంచి మోనోపాజ్ వచ్చే వరకు మహిళలకు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు అనేకం చుట్టుముడుతుంటాయి. నెలసరి సరిగా రాకపోవటం, ఇన్ ఫెక్షన్లు, పీసీఓడీ, రక్తహీనత, ఎండోమెట్రియాసిస్, రొమ్ము సంబంధిత వ్యాధులు ఇలా మహిళలకు వివిధ దశల్లో అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ప్రాథమిక దశలో వాటిని గుర్తించే అవకాశం ఉన్నా... అనేక రకాల సంశయాలతో ఆడవారు ఆస్పత్రికి వెళ్లి వ్యక్తిగత సమస్యలను చర్చించరు. కుటుంబ సభ్యులకు సైతం తమ సమస్యలను చెప్పని వారు అనేక మంది ఉంటారంటే అతిశయోక్తి కాదు.

Arogya Mahila Scheme in telangana: ఒక్కోసారి తల్లికో , తోబుట్టువుకో సమస్యను వివరించినా అవన్నీ ఆడవారికి సాధారణమే అనేవారే తప్ప ఆస్పత్రికి వెళ్లటం చాలా అరుదనే చెప్పాలి. అందుకు అనేక కారణాలు ఉన్నా... ప్రధానమైంది మాత్రం ఆస్పత్రిలో మగవైద్యులు ఉంటారన్న సంశయమే. ఈ నేపథ్యంలో మహిళల ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సర్కారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో ఈ ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. కరీంనగర్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు , స్థానిక ప్రజా ప్రతినిధులు, మంత్రులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

Telangana Govt Launch Arogya Mahila Scheme: ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళా వైద్యులు, సిబ్బందితో ప్రత్యేకంగా మహిళల కోసం సర్కారు క్లినిక్ లను నిర్వహించనుంది. పూర్తిగా మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు, మందుల పంపిణీ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా సర్వైకల్ క్యాన్సర్, యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్ వంటి వ్యాధులకు ర్యాపిడ్ టెస్టులు, పీసీఓడీ వంటి సమస్యలకు ఆల్ట్రా సౌండ్ స్కాన్ లు చేయటంతో పాటు... మైక్రో న్యూట్రియంట్స్ లోపాలకు సంబంధించిన రక్త పరీక్షలను ఉచితంగా అందించనున్నారు.

TS govt Women's Day Gift: మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌లు పెరుగుతున్న నేపథ్యంలో సొంతంగా రొమ్ము పరీక్షలను ఎలా చేసుకోవాలో మహిళలకు శిక్షణ సైతం ఇవ్వనున్నారు. మోనోపాజ్‌లో వచ్చే సమస్యలు, పీసీఓడీ లక్షణాలపై అవగాహన కల్పించనున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారం, వ్యాయామ విధానాలను సైతం వివరించనున్నారు. పీసీఓడీ వంటి సమస్యల పరిష్కారానికి యోగా, ఇతరత్రా వ్యాయామాలకు సంబంధించి ప్రత్యేకంగా వీడియోలను రూపొందించి యూట్యూబ్ లో అందుబాటులో ఉంచనున్నారు.

Telangana govt on women's health: మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్న సర్కారు... ఆరోగ్య మహిళా కోసం ప్రత్యేకంగా యాప్‌ని అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. మహిళల సమస్యలు, వారి టెస్టు రిపోర్టుల్ని యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయనుంది. ఫలితంగా అవసరమైన వారిని పెద్దాస్పత్రులకు రిఫర్ చేయటం సులభమవుతుందని వివరించింది.

ఇవీ చూడండి:

Last Updated : Mar 8, 2023, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.