ETV Bharat / state

శాసనసభలో నాలుగు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

author img

By

Published : Sep 9, 2020, 1:52 PM IST

రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చట్టింది. కొత్త రెవెన్యూ విధానానికి సంబంధించిన 4 బిల్లులను ముఖ్యమంత్రి కేసీఆర్​ శాసనసభలో ప్రవేశపెట్టారు. పూర్తి పారదర్శకత సేవలు అందించే లక్ష్యంతో బిల్లులు తెచ్చినట్లు స్పష్టం చేశారు. వీఆర్వో వ్యవస్థ రద్దవనుండగా రెవెన్యూ కోర్టుల స్థానంలో ట్రైబ్యునళ్లు ఏర్పాటు కానున్నాయి. భూవివాదాలపై ట్రైబ్యునళ్ల తీర్పే తుది నిర్ణయం కానుంది.

Ts government introduced four bills in the assembly monsoon session 2020
శాసనసభలో నాలుగు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

కొత్త రెవెన్యూ చట్టానికి అనుగుణంగా భూమిపై హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం-2020 బిల్లులు, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం- 2020 బిల్లును సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ధరణి వెబ్‌సైట్‌ ద్వారా భూముల బదిలీ ప్రక్రియకు సంబంధించి పంచాయతీరాజ్, పురపాలక చట్టాలకు సవరణలు ప్రతిపాదించారు. ఆయా బిల్లులను మంత్రులు కేటీఆర్​, ఎర్రబెల్లి దయాకర్‌రావు సభలో ప్రవేశపెట్టారు. కొత్త చట్టం అమలులోకి రాగానే 1971 భూహక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం రద్దవుతాయి. కేంద్ర, రాష్ట్రాల భూములకు చట్టంలోని అంశాలు వర్తించవని ప్రభుత్వం పేర్కొంది. కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ భూముల అమ్మకం, కొనుగోలు ముటేషన్ పూర్తవగానే హక్కులు బదిలీ అవుతాయి. ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేస్తారు. మోసపురితంగా ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తే రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్‌ను బర్తరఫ్ చేసి, క్రిమినల్ కేసులు పెట్టి భూములు స్వాధీనం చేసుకుంటారు.

కొత్తబిల్లు ప్రకారం హక్కుల రికార్డుల్లో ప్రభుత్వం సవరణలు చేస్తే ఆ అధికారిపై ఎలాంటి దావా వెయ్యరాదు. ఇప్పటి వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయని భూములకు పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం కొత్త చట్టం ద్వారా తహశీల్దార్‌కు లభిస్తుంది. డిజిటల్ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలి. పంట రుణాల కోసం పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో తనఖా పెట్టుకోరాదు. ఈ చట్టం సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 కింద విచారణకు అర్హత ఉంటుంది. బిల్లు చట్టరూపం దాల్చగానే పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971 రద్దు అవుతుంది. రికార్డులను దిద్దడం- మోసపూర్తిత ఉత్తర్వులు జారీ చేసే అధికారులు, ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. సర్వీస్ నుంచి తొలగించి బర్తరఫ్ చేస్తారు. 1971 యాక్ట్ రద్దు అవగానే పెండింగ్‌లోని ఫైల్స్, కేసులన్నీ ప్రత్యేక ట్రైబ్యునల్‌కు బదిలీ అవుతాయి. విచారణ తర్వాత ట్రైబ్యునల్ ఉత్తర్వులే తుది నిర్ణయం. కొత్తచట్టం ఏర్పాటైన తరువాత నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది. భూ రికార్డులను ఆధునీకీకరించి డిజిలైజేషన్ చేసినందున గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ అవసరం లేదని భావించిన ప్రభుత్వం వీఆర్వో పోస్టులను రద్దు చేసింది. ప్రతీ ఉద్యోగిని ప్రభుత్వ శాఖల్లో ఏదైనా సమాన స్థాయి కలిగిన ఉద్యోగానికి బదిలీ చేసుకునే అధికారం కల్పించింది. బదిలీకి విముఖంగా ఉంటే స్వచ్చంద పదవీ విరమణకు అవకాశం కల్పించారు.

భూ రికార్డులకు సంబంధించిన ధరణి పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా యాజమాన్య హక్కు మార్పిడి-మ్యుటేషన్ చేయడానికి ప్రభుత్వానికి వీలు కల్పించింది. ఈ మేరకు పంచాయితీ రాజ్, వీఆర్వో చట్టం 1955, తెలంగాణ మున్సిపల్ యాక్ట్-2019 చట్ట సవరణ బిల్లులకు సవరణలు చేపట్టింది. ధరణి పోర్టల్ నుంచి ఆన్‌లైన్‌లో తక్షణమే మ్యుటేషన్ ధ్రువపత్రం జారీ చేసే అధికారం ప్రభుత్వానికి చట్టం కల్పించింది. ఆస్తి పన్ను, విద్యుత్, నీటి బకాయిలు చెల్లిస్తేనే స్థలాల యాజమాన్య హక్కులు బదిలీ అయ్యేలా పురపాలకశాఖ సవరణ చేపట్టింది. వీటితోపాటు నగర శివారు కొత్తూరు-తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ.. కొత్తూరు పురపాలక సంఘంగా ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం మాంమొలి గ్రామంలోని కొన్ని సర్వే నంబర్లు తెల్లపూర్ మున్సిపాలిటీలో చేర్చింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 10 గ్రామాలను మినహాయించింది. పెద్దతండా, పోలిపల్లి, ఈదులపురం, చిన్నవెంకటగిరి, గుర్రాలపాడు, గుదిమళ్ల తదితర గ్రామాలు మినహాయించి గ్రామ పంచాయితీలుగా కొనసాగించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

ఇవీ చూడండి: శాసనసభలో స్పీకర్‌తో విపక్షాల వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.